ఏపీ టూరిజం ఛైర్మన్ ఖతార్ పర్యటన! ఆంధ్ర వెల్ఫేర్ అసోసియేషన్ ఖతార్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు!

Header Banner

ఏపీ టూరిజం ఛైర్మన్ ఖతార్ పర్యటన! ఆంధ్ర వెల్ఫేర్ అసోసియేషన్ ఖతార్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు!

  Tue Nov 26, 2024 20:51        Qatar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డా. నుకసాని బాలాజీ ఖతార్ పర్యటన 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డా. నుకసాని బాలాజీ ఖతార్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఖతార్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఈ వేడుకలు ఆంధ్ర వెల్ఫేర్ అసోసియేషన్ - ఖతార్ టీమ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సభను ఉద్దేశిస్తూ అయన రాష్ట్ర ఆవిర్భావం, పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం, ఆంధ్రరాష్ట్ర అభివృద్ధిలో నాటి ముఖ్యమంత్రుల పనితీరు, దివంగత ముక్యమంత్రి, ఎన్టీఆర్ గారు చేసిన సేవ, తెలుగు ప్రజలకు తెచ్చిన గుర్తింపు నేటి తరానికి వివరించారు, అలాగే వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతిక రంగంలోనే కాకుండా కళలు, సాహిత్యం, సంగీతం వంటి అనేక రంగాల్లో మనకంటూ ప్రత్యేక గుర్తింపు ఎలావచ్చిందో చెప్పుకొచ్చారు. మన రాష్ట్రంలోని రైతులు, కార్మికులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు ఇలా ప్రతిఒక్కరూ తమ కృషి ద్వారా రాష్ట్ర అభివృద్ధికి అంకితభావంతో ఎలా కృషి చేసారో వివరించారు. అలాగే, చంద్రబాబు నాయుడు గారు, తన సుదీర్ఘ ప్రజాసేవా ప్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాంకేతికత, డిజిటల్ రంగాల్లో అభివృద్ధి దిశగా ఎలా తీసుకెళ్లారు.. నిరంతరం ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం సాంకేతిక రంగంలో ఎన్నో ప్రగతులను సాధించిందిని.. కొనసాగుతుందని.. ఆయన స్మార్ట్ సిటీలు, ఐటీ రంగాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలబెడతాయని ఆశాభావం వ్యక్తం చేసారు.. ఆయన విజయవంతంగా అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించడం, రాష్ట్రానికి కొత్త మార్గాన్ని చూపించారు అని చెప్పుకొచ్చారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

మూడు రోజుల ఖతార్ పర్యటనలో ఆయన ఖతార్‌లోని ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శించారు. 
పర్యటనలో భాగంగా, కతారా హిల్స్, బీచులు, మ్యూజియంలు, సీలైన్ బీచ్ వంటి ప్రదేశాలను సందర్శించారు. అంతేకాక, ఖతార్ సీలైన్ బీచ్‌లో డెజర్ట్ సఫారీని అనుభవించి, దాని ప్రత్యేకతలను గమనించారు. ఈ పర్యటన ఖతార్ టీడీపీ లీడర్‌షిప్ ఆధ్వర్యంలో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. 

 

తర్వాత, టీడీపీ ఖతార్ టీమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ గారు సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఖతార్‌లోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధి, నిర్వహణపై ఆయన ప్రేరణ పొందానని..ఖతార్‌లో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను గమనించి, వాటిని ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయాలనే దృఢ నిశ్చయంతో ఆయన పర్యటనను ముగించారు. ప్రవాసులు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.. పర్యాటక రంగంలో ఎన్నో అవకాశాలున్నాయని.. ఆసక్తిఉన్నవారు తమని సంప్రదిస్తే తప్పక ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. 

 

ఈ సందర్భంగా, ఆంధ్ర వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఖతార్ ఎన్ఆర్ఐ టీడీపీ సంయుక్తంగా డా. నుకసాని బాలాజీ గారికి దోహా - విజయవాడ మధ్య ప్రత్యేక ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు వారానికి రెండు లేదా మూడు సార్లు నడిపేలా చూడాలని అభ్యర్థిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు. ఆయనకు అభినందనలు తెలిపిన టీడీపీ ఖతార్ టీమ్, ఆంధ్ర వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, అలాగే ఖతార్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలు ఈ పర్యటనను విజయవంతంగా పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఖతార్ తెలుగు ప్రజల ప్రేమాభిమానాలు ఛైర్మన్ గారిని మరింతగా ఆకర్షించాయి.

WhatsApp Image 2024-11-26 at 14.27.41.jpeg

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే!

 

అమెరికా జైలుకి జగన్ - జీవితాంతం ఏపీకి తిరిగిరాడు! నీకు ఇప్పుడు దమ్ము ఉంటే..?

 

26/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

సుప్రీంకోర్టులో విజయపాల్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఈ కేసులో ఇప్పటికే!

 

ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!

 

అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Gulf #GulfNews #TeluguMigrants #IndianMigrants