ట్రంప్‌కు అధ్యక్ష పదవిలో భారీ ఊరట! 2020 ఎన్నికల కేసు కొట్టివేత!

Header Banner

ట్రంప్‌కు అధ్యక్ష పదవిలో భారీ ఊరట! 2020 ఎన్నికల కేసు కొట్టివేత!

  Tue Nov 26, 2024 20:29        U S A

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)నకు కేసుల విషయంలో భారీ ఊరట ໖໖. 5 2020 కొట్టివేస్తునట్లు న్యాయస్థానం తీర్పునిచ్చింది. (2020 Election Case on Trump)2 అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్పై ఉన్న 2020 నాటి ఎన్నికల కేసును కొట్టివేయాలని ఆయన తరఫు న్యాయవాది జాక్ స్మిత్ కోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్ధనను న్యాయమూర్తి తాన్యా చుట్కాన్ అంగీకరించారు. 'కేసును తొలగించడం సముచితం. ఈ తీర్పు అధ్యక్షుడు పదవిలో ఉన్నంతవరకు మాత్రమే. బాధ్యతల నుంచి వైదొలిగిన వెంటనే తీర్పు గడువు ముగుస్తుంది' అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
2020 ఎన్నికల నాటి కేసు (Trump Election Case) కొట్టివేయడంపై ట్రంప్ స్పందించారు. 'ఈ కేసులు చట్టవిరుద్ధమైనవి. మాపై పోరాడేందుకు మా ప్రత్యర్థులైన డెమోక్రట్లు పన్ను చెల్లింపుదారులకు చెందిన 100 మిలియన్ డాలర్లు వృథా చేశారు. ఇంతకుముందు మన దేశంలో ఇటువంటివి జరగలేదు' అని ట్రూత్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో దిగిన ట్రంప్ పారాజయం పాలైన విషయం తెలిసిందే. అనంతరం ఆయన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నప్పుడు వైట్ హౌస్ నుంచి పలు కీలక దస్త్రాలు తరలించారని ఆరోపిస్తూ కేసులు నమోదయ్యాయి.



ఇంకా చదవండి25/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!



అయితే, ఈ కేసులు ఎప్పుడూ విచారణకు రాకపోవడం గమనార్హం. అమెరికాలో న్యాయశాఖ నిబంధనల ప్రకారం.. సిట్టింగ్ అధ్యక్షుడు క్రిమినల్ విచారణను ఎదుర్కోకుండా వారికి రక్షణ ఉంటుంది. ప్రస్తుత ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో మరికొన్ని రోజుల్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో గతంలో ఆయనపై నమోదైన పలు కేసుల్లో ఊరట లభిస్తుంది. ఇటీవల హష్ మనీ కేసులో ట్రంప్నకు శిక్ష ఖారారయినప్పటికీ.. ఆ శిక్షను నిరవధికంగా వాయిదా వేస్తూ న్యూయార్క్ జడ్జి తీర్పునిచ్చారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే!

 

అమెరికా జైలుకి జగన్ - జీవితాంతం ఏపీకి తిరిగిరాడు! నీకు ఇప్పుడు దమ్ము ఉంటే..?

 

26/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

సుప్రీంకోర్టులో విజయపాల్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఈ కేసులో ఇప్పటికే!

 

ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!

 

అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #america #donaldtrump #electioncase #2020case #case #todaynews #flashnews #latestupdate