ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం! ఇక ఆ సమస్య లేనట్టే!

Header Banner

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం! ఇక ఆ సమస్య లేనట్టే!

  Wed Dec 04, 2024 09:37        Politics

రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం, విద్యాప్రమాణాల మెరుగుదల కోసం మంత్రి నారా లోకేశ్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ... పదో తరగతి పూర్తిచేసిన పేద విద్యార్థుల్లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉన్నారని వెల్లడించారు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా డ్రాపౌట్స్ ను కొంతమేర తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. 

 

ఇంకా చదవండి: మందుబాబులకు బిగ్ షాక్.. రాష్ట్రంలో వైన్స్ బంద్! ఎప్పటి నుంచంటే..? ఎందుకంటే?

 

ఇంటర్మీడియట్ లో వెనుకబడిన విద్యార్థులకు క్వశ్చన్ బ్యాంక్ అందించాలని సూచించారు. సంకల్ఫ్ ద్వారా చేపట్టిన ఇంటర్ విద్యార్థుల ఎసెస్ మెంట్ ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, ఆయా కళాశాల లెక్చరర్లు, సిబ్బందిని కేర్ టేకర్స్ గా నియమించాలని నిర్ణయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బాగా దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేపట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ 7న నిర్వహించే మెగా పేరెంట్-టీచర్ సమావేశాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి లోకేశ్ సూచించారు. మంత్రులు, శాసనసభ్యులు వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లోనే మెగా పీటీఎం సమావేశాలకు హాజరు కావాలని అన్నారు. ఎటువంటి పార్టీ జెండాలు, హంగు, ఆర్భాటాలకు పోవద్దని స్పష్టంచేశారు. బాపట్ల ప్రభుత్వ హైస్కూలులో నిర్వహించే మెగా పీటీఎం నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు తాను కూడా హాజరుకానున్ననట్లు లోకేశ్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల మెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని సమావేశంలో నిర్వహించారు.

ఇంకా చదవండి: ఆ జిల్లాలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్! ఇలా అప్లై చేసుకుంటే - నేరుగా అకౌంట్లోకి రూ. 2.50 లక్షలు జమ!

 

ఇందుకోసం 18 అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే పాఠ్యాంశాల కోసం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చిన్నతనం నుంచే బాలలు, బాలికలు సమానమేనన్న భావన కలిగించేలా లింగ సమానత్వం, సివిక్ సెన్స్ పై అవగాహన పెంచాలని తెలిపారు. విద్యార్థులకు జపనీస్ మోడల్ లైఫ్ స్కిల్స్ ను అలవర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల విద్యకు గొడ్డలిపెట్టులా గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117ను రద్దుచేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మెరుగైన విధానం అమలుకు గ్రామస్థాయిలో అభిప్రాయ సేకరణ జరపాలని, ఈ సమావేశాలకు స్కూలు మేనేజ్ మెంట్ కమిటీలను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు.  స్కూలు మైదానాలను జాబ్ మేళాలకు మినహా ఎటువంటి కార్యకలాపాల నిర్వహణకు అనుమతి ఇవ్వరాదని  మంత్రి స్పష్టంచేశారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... ఐటీ గ్లోబల్ పాలసీకు ఆమోదం! ఆంధ్రా పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప అవకాశం!

 

అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!

 

చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!

 

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..? చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా!

 

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting