ఏటీఎం నుంచి పీఎఫ్ విత్‌డ్రా! జనవరి నుంచి అందుబాటులోకి కొత్త విధానం!
Thu Dec 12, 2024 11:01 Indiaఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ పీఎఫ్ సొమ్మును తీసుకోవడం ఇక మీదట మరింత సులువు కానుంది. బ్యాంకు అకౌంట్ నుంచి ఏటీఎం ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసుకున్నంత సులభంగా ఈపీఎఫ్ఓ ఖాతా నుంచి డబ్బులు తీసుకునే వెసులుబాటు రానున్నది. జనవరి నుంచి ఖాతాదారులు పీఎఫ్ డబ్బులను నేరుగా ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమిత దావ్రా బుధవారం ప్రకటించారు.
ఇంకా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. ఆధారాలతో దొరికేసిన మాజీ మంత్రి! ఐపీఎస్ తో సహా, అందుకు సహకరించిన వారి పేర్లను!
ఇంకా చదవండి: వైసీపీకి వరుస షాక్ లు.. పార్టీకి రాజీనామా చేయనున్న మాజీ మంత్రి! దానికి కారణం అదేనా?
ఈ మేరకు తమ ఐటీ వ్యవస్థలను ఆధునీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే ఈపీఎఫ్ఓ క్లెయిమ్‌లను చాలా వేగంగా పరిష్కరిస్తున్నామని, ఇప్పుడు మరింత సులువుగా మార్చే దిశగా పని చేస్తున్నట్టు చెప్పారు. క్లెయిమ్‌దారు, లబ్ధిదారులు నేరుగా ఏటీఎంల ద్వారా తమ క్లెయిమ్ డబ్బులను పొందొచ్చని చెప్పారు. అయితే, ఈ కొత్త విధానం ఎలా పని చేస్తుందన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఆన్లైన్లో క్లెయిమ్ చేసుకున్నాక వారం, పది రోజుల్లో బ్యాంకు ఖాతాలోకి డబ్బులు పడుతున్నాయి. మరి, ఈ కొత్త విధానం ఇందుకు ఏ రకంగా భిన్నంగా ఉంటుందనేది తెలియాల్సి ఉంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?
ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మనోజ్! ఏడు నెలల కూతురును కూడా!
నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదల? ఎప్పుడు అంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Business #PF #ProvidendFund
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.