3 చెకోపోస్టులు పెట్టిన ఆగని అక్రమ రవాణా! కలెక్టర్ల సమావేశంలో పవన్ కల్యాణ్ ఆగ్రహం!

Header Banner

3 చెకోపోస్టులు పెట్టిన ఆగని అక్రమ రవాణా! కలెక్టర్ల సమావేశంలో పవన్ కల్యాణ్ ఆగ్రహం!

  Thu Dec 12, 2024 11:01        Politics

పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి కాకినాడ పోర్టులో 3 చెకోపోస్టులు పెట్టిన తర్వాత కూడా బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే ఎవరిని నిందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. దీనికి అడ్డుకట్ట వేయడం కలెక్టర్, ఎస్పీల బాధ్యత కాదా అని నిలదీశారు. ఆ అధికారులు దీన్ని ఎలా విస్మరిస్తారన్నారు. విజిలెన్స్ శాఖ తన పని తాను సక్రమంగా నిర్వర్తిస్తే మంత్రి అక్కడి వెళ్లి అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎందుకొస్తుందన్నారు. సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. 'గత ప్రభుత్వం ఎక్కడా నిబంధనలు పాటించలేదు. వీటిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రజాస్వామ్య పరిరక్షకులుగా వ్యవహరిస్తున్నాం. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. మేం ప్రజల కష్టాల గురించి మాట్లాడగలం, పాలసీలు రూపొందించగలమే గానీ క్షేత్రస్థాయిలో దాన్ని ప్రజలకు చేరువ చేయాల్సిందే కలెక్టర్లే' అని అన్నారు.



ఇంకా చదవండినల్లపాడులో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ ఘటన కలకలం! డబ్బులు డిమాండ్ చేసిన వైకాపా నేత.. ఎంతో తెలిస్తే షాక్!



అధికారులు అభ్యంతరం చెప్పకపోవడం వల్లే అప్పుల కుప్పలా రాష్ట్రం
'సినిమా టికెట్ల విక్రయం దగ్గర నుంచి ఇసుక దోపిడీ వరకు అన్నింటిలోనూ గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. ఇంతమంది సీనియర్ అధికారులు, బ్యూరోక్రాట్లు ఉన్నా ఒక్కరైనా అలాంటివాటికి ఎందుకు అడ్డు చెప్పలేదని చాలా ఆశ్చర్యం కలిగింది. గత ఐదేళ్లూ అధికారులు కేవలం వినడానికే పరిమితమయ్యారు. వారు రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలకు 'నో' చెప్పకపోవడం వల్లే రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం పడింది. వ్యవస్థలను బలోపేతం చేయాల్సింది పోయి బ్యూరోక్రాట్లు కూడా నిస్సహాయంగా ఉంటే సగటు మనిషి ఎక్కడికి వెళ్లాలి? పరిపాలన అంటే ఆంధ్రప్రదేశ్గా ఉండాలనే స్థాయి నుంచి పరిపాలన ఎలా ఉండకూడదో మీ రాష్ట్రం చేసి చూపించిందని కేంద్ర అధికారులు మాట్లాడే స్థాయికి వచ్చాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆ మచ్చను చెరిపేసుకోవాలి. ప్రజలకు మేలు చేసేందుకే ఉన్నాం. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నాం. దానికి కలెక్టర్ల సహకారం అవసరం' అని దిశానిర్దేశం చేశారు.



ఇంకా చదవండినల్లపాడులో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ ఘటన కలకలం! డబ్బులు డిమాండ్ చేసిన వైకాపా నేత.. ఎంతో తెలిస్తే షాక్!



చంద్రబాబు విజన్ అద్భుతం..
'రాష్ట్రానికి గూగుల్ సంస్థను తీసుకురావడం గొప్ప విజయం. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావించాలి. రాష్ట్ర భవిష్యత్తుపై ఆయనకున్న విజన్ అద్భుతం. దానికి అనుగుణంగా మనం ముందుకెళితే రాష్ట్రం కచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. అంతా కలిసి వ్యవస్థలను బలోపేతం చేద్దాం' అని పిలుపునిచ్చారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?

 

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం - నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు! ఆ జిల్లాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం!

 

మంత్రి లోకేశ్ ను మెచ్చుకున్న చంద్రబాబు! ఎందుకు అంటే! ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు..

 

ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మ‌నోజ్! ఏడు నెల‌ల కూతురును కూడా!

 

 గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2024 లిస్ట్‌! నెటిజన్లు ఎక్కువగా ఏమి వెతికారో తెలుసా? పవన్ కల్యాణ్ స్థానం ఎంతంటే?

 

వైన్ షాపులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! బెల్ట్ షాపుల యజమానులపై.. ఇక కిక్కు ఎక్కాల్సిందే!

 

ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss

 

నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదలఎప్పుడు అంటే?

 

 

నేడు (11/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక.. మంత్రి కీలక ప్రకటన! రాష్ట్రంలో రూ.340 కోట్లతో..

 

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

మరో ఫుడ్ పాయిజన్ ఘటన... రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం! విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ!

 

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #rice #illegal #transport #export #checkpost #pawankalyan #deputycm #meeting #warning #todaynews #flashnews #latestupdate