చెన్నైలో కుండపోత వర్షం! 11 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు! అలర్ట్‌ ప్రకటించిన ఐఎండీ!

Header Banner

చెన్నైలో కుండపోత వర్షం! 11 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు! అలర్ట్‌ ప్రకటించిన ఐఎండీ!

  Thu Dec 12, 2024 12:25        Environment

తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తమిళనాడు రాజధాని చెన్నై.. లో కుండపోత వర్షం పడుతోంది. భారీ వర్షం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.

 

ఇంకా చదవండివైసీపీకి దిమ్మతిరిగే షాక్.. ఆధారాలతో దొరికేసిన మాజీ మంత్రి! ఐపీఎస్ తో సహా, అందుకు సహకరించిన వారి పేర్లను! 

 

చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విళ్లుపురం, కళ్లకురిచ్చి, రామనాథపురం, అరియలూరు, కడలూరు, కరైక్కల్‌, తిరుచ్చి, నాగపట్టణం, కోయంబత్తూర్‌ సహా తదితర జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా పలు జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. చెన్నై, విల్లుపురం, తంజావూరు, మైలాదుతురై, పుదుక్కోట్టై‌, కడలూరు, దిండిగల్‌, రామనాథపురం, తిరువావూర్‌, రాణిపేట్‌, తిరువళ్లూరు జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు సెలవు ఇచ్చారు. 

 

ఇంకా చదవండి: వైసీపీకి వరుస షాక్ లు.. పార్టీకి రాజీనామా చేయనున్న మాజీ మంత్రి! దానికి కారణం అదేనా?

 

ఇక ఇవాళ ఉదయం తూత్తుకుడిలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరోవైపు పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. వేలూరు, పెరంబూర్‌, సేలం, నమక్కల్‌, శివగంగ, మదురై, దిండిగల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు అలర్ట్‌ ప్రకటించింది. అదేవిధంగా తూత్తుకుడి, తెన్కాసి, తెని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జిల్లా కలెక్టర్లతో ఏపీ ప్రభుత్వం కీలక సమావేశం! అదే మనకు శ్రీరామ రక్ష - ఎవరైనా అతిక్రమించి వ్యహరిస్తే!

 

గల్ఫ్: విదేశాల నుంచి వాపస్ వచ్చినవారి పునరావాసం, పునరేకీకరణకు కృషి! ప్రాజెక్ట్ లక్ష్యాలు, ముఖ్య లబ్ధిదారులు..

 

నేడు (12/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?

 

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం - నేడురేపు ఏపీలో భారీ వర్షాలు! ఆ జిల్లాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం!

  

ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మ‌నోజ్! ఏడు నెల‌ల కూతురును కూడా!

    

నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదలఎప్పుడు అంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Environment #Rains #Storms #Nature #AndhraPradesh #WeatherAlert #RainAlert