ట్రంప్ ట్వీట్‌తో రే నిర్ణయం పై దుమారం! FBIలో కొత్త చారిత్రక మార్పులు!

Header Banner

ట్రంప్ ట్వీట్‌తో రే నిర్ణయం పై దుమారం! FBIలో కొత్త చారిత్రక మార్పులు!

  Thu Dec 12, 2024 15:59        U S A

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్  మరికొన్ని రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే, ట్రంప్ ఆ బాధ్యతలు చేపట్టకముందే తాను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్  డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తానని క్రిస్టోఫర్ రే  పేర్కొన్నారు. ట్రంప్ తన కార్యవర్గంలో ఎఫ్బీఐ డైరెక్టర్గా కశ్యప్ పటేల్ను ఎంపిక చేసిన కొన్ని రోజుల తర్వాత రే ఈమేరకు నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. 'ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన పూర్తయ్యేవరకు నేను ఎఫ్బీఐ డైరెక్టర్గా బ్యూరోకు సేవ చేస్తాను. ఆపై పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా. ఇది నాకు అంత సులభమైన విషయం కాదు. నేను నా పనిని, ప్రజలను ఎంతో ప్రేమిస్తాను. ఈ విషయం బహిరంగంగా ప్రకటించడానికి ముందే మీకు ఈ విషయం తెలియడం ముఖ్యం' అని క్రిస్టోఫర్ తన సహోద్యోగులతో పేర్కొన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.


ఇంకా చదవండినల్లపాడులో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ ఘటన కలకలం! డబ్బులు డిమాండ్ చేసిన వైకాపా నేత.. ఎంతో తెలిస్తే షాక్!



మరోవైపు క్రిస్టోఫర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 'క్రిస్టోఫర్ రే రాజీనామా అమెరికాకు గొప్ప రోజు. ఆయన నాయకత్వంలోని ఎఫ్బీఐ ఎలాంటి కారణం లేకుండానే నా ఇంట్లో సోదాలు చేశారు. వారు అధికారాన్ని ఉపయోగించి అనేకమంది అమాయకులైన అమెరికన్ ప్రజలను బెదిరించారు. వారిలో కొందరు ఎప్పటికీ కోలుకోలేని స్థితిలో ఉన్నారు. అందరికీ తెలిసినట్లు ఎఫ్బీఐపై నాకు ఎంతో గౌరవం ఉంది. అమెరికన్ ప్రజలు న్యాయపరమైన వ్యవస్థను డిమాండ్ చేస్తున్నారు. అటువంటి దానికోసం మేము ఎదురుచూస్తున్నాం. అది కశ్యప్ పటేల్తోనే సాధ్యమవుతుంది' అని ట్రూత్లో రాసుకొచ్చారు. రే ఎఫ్బీఐ డైరెక్టర్గా ఏడేళ్లపాటు చిత్తశుద్ధితో సేవలందించారని అటార్నీ జనరల్ మెరిక్ బి గార్లాండ్ పేర్కొన్నారు. ఈసందర్భంగా ఎఫ్బీఐలోని అధికారులకు గార్లాండ్ కృతజ్ఞతలు తెలియజేశారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?

 

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం - నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు! ఆ జిల్లాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం!

 

మంత్రి లోకేశ్ ను మెచ్చుకున్న చంద్రబాబు! ఎందుకు అంటే! ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు..

 

ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మ‌నోజ్! ఏడు నెల‌ల కూతురును కూడా!

 

 గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2024 లిస్ట్‌! నెటిజన్లు ఎక్కువగా ఏమి వెతికారో తెలుసా? పవన్ కల్యాణ్ స్థానం ఎంతంటే?

 

వైన్ షాపులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! బెల్ట్ షాపుల యజమానులపై.. ఇక కిక్కు ఎక్కాల్సిందే!

 

ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss

 

నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదలఎప్పుడు అంటే?

 

 

నేడు (11/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక.. మంత్రి కీలక ప్రకటన! రాష్ట్రంలో రూ.340 కోట్లతో..

 

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

మరో ఫుడ్ పాయిజన్ ఘటన... రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం! విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ!

 

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #america #trump #fbi #changes #todaynews #flashnews #latestupdate