హైవేపై క్రాష్‌ ల్యాండ్‌ అయిన విమానం! తర్వాత ఏం జరిగిందంటే?

Header Banner

హైవేపై క్రాష్‌ ల్యాండ్‌ అయిన విమానం! తర్వాత ఏం జరిగిందంటే?

  Thu Dec 12, 2024 15:15        U S A

చిన్న విమానం హైవేపై క్రాష్‌ ల్యాండ్ అయ్యింది. వాహనాలపై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ విమానం రెండు ముక్కలైంది. అయితే పైలట్‌తోపాటు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ట్విన్ ఇంజన్ ప్రొపెల్లర్ విమానం విక్టోరియాలోని స్టేట్ హైవేపై చాలా తక్కువ ఎత్తులో ఎగిరింది. రహదారిపై వెళ్తున్న మూడు కార్లను ఢీకొట్టి క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది. ఈ ప్రమాదంలో ఆ విమానం రెండు ముక్కలైంది. దీంతో విమానం శిథిలాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.

 

ఇంకా చదవండివైసీపీకి దిమ్మతిరిగే షాక్.. ఆధారాలతో దొరికేసిన మాజీ మంత్రి! ఐపీఎస్ తో సహా, అందుకు సహకరించిన వారి పేర్లను! 

 

కాగా, ఈ ప్రమాదంలో పైలట్‌తో సహా నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో పోలీసులు, అధికారులు ఊరట చెందారు. వైమానిక అధికారులు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కొందరు వ్యక్తులు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డ్‌ చేసిన వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జిల్లా కలెక్టర్లతో ఏపీ ప్రభుత్వం కీలక సమావేశం! అదే మనకు శ్రీరామ రక్ష - ఎవరైనా అతిక్రమించి వ్యహరిస్తే!

 

గల్ఫ్: విదేశాల నుంచి వాపస్ వచ్చినవారి పునరావాసం, పునరేకీకరణకు కృషి! ప్రాజెక్ట్ లక్ష్యాలు, ముఖ్య లబ్ధిదారులు..

 

నేడు (12/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?

 

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం - నేడురేపు ఏపీలో భారీ వర్షాలు! ఆ జిల్లాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం!

  

ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మ‌నోజ్! ఏడు నెల‌ల కూతురును కూడా!

    

నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదలఎప్పుడు అంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants