సాంకేతిక లోపంతో చాట్‌జీపీటీ సేవ‌ల్లో అంత‌రాయం! ఇబ్బందుల్లో యూజ‌ర్లు!

Header Banner

సాంకేతిక లోపంతో చాట్‌జీపీటీ సేవ‌ల్లో అంత‌రాయం! ఇబ్బందుల్లో యూజ‌ర్లు!

  Thu Dec 12, 2024 14:03        Technology

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బేస్డ్ చాట్‌బోట్ చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా లక్షలాది మంది యూజర్లు చాట్‌జీపీటీ సేవలు లభించక పోవడంతో ఇబ్బందుల పాలవుతున్నారు. దీనిపై యూజర్లకు ‘ఎక్స్ (మాజీ ట్విటర్)’ వేదికగా క్షమాపణ చెప్పిన ఓపెన్ ఏఐ.. సమస్య గుర్తించామని, దాని పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని తెలిపింది. త్వరలోనే చాట్‌జీపీటీ గ్లోబల్ ఔటేజ్‌పై అప్‌డేట్ ఇస్తామని పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం తెల్లవారు జాము నుంచి చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. చాట్‌జీపీటీతోపాటు సంస్థకు చెందిన ఏపీఐ, సోరా సేవల్లో ఈ సమస్య తలెత్తిందని ఓపెన్ ఏఐ తెలిపింది. అయితే, ఎప్పటిలోగా సమస్య పరిష్కారం అవుతుందో వెల్లడించలేదు. దీనివల్ల ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీపై ఆధార పడిన సంస్థల కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు.

 

ఇంకా చదవండివైసీపీకి దిమ్మతిరిగే షాక్.. ఆధారాలతో దొరికేసిన మాజీ మంత్రి! ఐపీఎస్ తో సహా, అందుకు సహకరించిన వారి పేర్లను! 

 

2022 చివర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పని చేసే చాట్‌జీపీటీని ఓపెన్ ఏఐ అందుబాటులోకి తెచ్చింది. ఈ చాట్‌బోట్ సాయంతో యూజర్లు తమకు అవసరమైన ఖచ్చితమైన సమాచారాన్ని సెకన్లలోనే అందుకోవచ్చు. కాగా, బుధవారం రాత్రి మెసేజింగ్ యాప్ వాట్సాప్‌తోపాటు ఇన్ స్టా‌గ్రామ్, ఫేస్ బుక్ సేవల్లో అంతరాయం నెలకొంది. సాంకేతిక లోపం వల్ల యూజర్లు తమ యాప్స్ సేవలు ఉపయోగించుకోలేదని మెటా పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా సేవలు పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామని వివరించింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జిల్లా కలెక్టర్లతో ఏపీ ప్రభుత్వం కీలక సమావేశం! అదే మనకు శ్రీరామ రక్ష - ఎవరైనా అతిక్రమించి వ్యహరిస్తే!

 

గల్ఫ్: విదేశాల నుంచి వాపస్ వచ్చినవారి పునరావాసం, పునరేకీకరణకు కృషి! ప్రాజెక్ట్ లక్ష్యాలు, ముఖ్య లబ్ధిదారులు..

 

నేడు (12/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?

 

కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం - నేడురేపు ఏపీలో భారీ వర్షాలు! ఆ జిల్లాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం!

  

ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మ‌నోజ్! ఏడు నెల‌ల కూతురును కూడా!

    

నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదలఎప్పుడు అంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Technology #Gadgets #ChatGPT #TechnicalError