పసిఫిక్ మహా సముద్రంలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం! తీరంలో అలజడి!

Header Banner

పసిఫిక్ మహా సముద్రంలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం! తీరంలో అలజడి!

  Tue Dec 17, 2024 15:10        Others

పసిఫిక్ మహాసముద్రం రీజియన్ లోని వనౌటులో పెను భూకంపం సంభవించింది. చిన్న ద్వీపదేశం ఇది. ఇక్కడి తీరప్రాంతంలో 7.4 తీవ్రతతో భూమి కంపించింది. దీని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. ఆ తరువాత దాన్ని ఉపసంహరించుకున్నారు. 

 

భూకంప తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో తీర ప్రాంతాలు పోటెత్తాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. తొలుత సునామీ హెచ్చరికలు జారీ కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తీర ప్రాంతం మొత్తాన్నీ ఖాళీ చేయించారు. వనౌటు రాజధాని పోర్ట్ విలా బీచ్‌లను తాత్కాలికంగా మూసివేశారు. 

 

స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి 12:47 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది. పోర్ట్‌విలాకు దక్షిణ దిశగా 57 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహా సముద్రంలో భూమి ప్రకంపించింది. ఉపరితలం నుంచి ఆరు కిలోమీటర్ల లోతున టెక్టోనిక్ ప్లేట్‌లో సంభవించిన పెను కదలికల వల్ల ఈ భూకంపం సంభవించినట్లు యూఎస్‌జీఎస్ పేర్కొంది. 

 

ఇంకా చదవండిశ్రీవారి సేవా టికెట్ల విడుదలకు షెడ్యూల్ ఖరారు! భక్తుల కోసం తితిదే ప్రత్యేక ప్రకటన! 

 

ఇంకా చదవండిఏపీ ప్రజల కోసం మరో పథకం తెచ్చిన చంద్రబాబు! వారందరికీ ఫ్రీగా రూ.2వేల.. వైసీపీ సర్కార్ వాటిలో!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

భూకంపం సంభవించిన వెంటనే హవాయ్‌లోని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ అప్రమత్తం అయింది. 7.4 తీవ్రతతో కూడుకున్న ప్రకంపనలు కావడం వల్ల సునామీ అలర్ట్ ను జారీ చేసింది. ఆ తరువాత దాన్ని ఉపసంహరించుకుంది. భూకంప తీవ్రత వల్ల వనౌటు తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. తీరంలో అలలు సాధారణ స్థాయి కంటే మీటర్ ఎత్తుకు ఎగిసిపడ్డాయి. 

 

పోర్ట్‌విలాలో భారీగా ఆస్తినష్టం సంభవించింది. పలు భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని భవనాలకు సంబంధించన పిల్లర్లు, సన్ షెడ్లు కూలిపోయాయి. అక్కడ పార్కింగ్‌లో ఉంచిన వాహనాలపై పడటంతో అవన్నీ ధ్వంసం అయ్యాయి. భూకంప ధాటికి వనౌటులో గల అమెరికా రాయబార కార్యాలయం పాక్షికంగా దెబ్బతిన్నది. ఈ భవనం కాంక్రీట్ పిల్లర్లు కిందపడ్డాయి. 

 

దీనికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. న్యూ కాలెడోనియా, సోలమన్ దీవులపైనా దీని ప్రభావం పడింది. ఆయా దేశాల్లో కూడా తీర ప్రాంతాలన్నీ అల్లకల్లోలంగా మారాయి. అలలు పోటెత్తాయి. సాధారణ స్థాయి కంటే 0.3 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. వనౌటుకు పొరుగునే ఉన్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల తీర ప్రాంతాలు కూడ అలజడికి గురయ్యాయి. వనౌటు.. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉంది. ఇక్కడ టెక్టోనిక్ ప్లేట్లు తరచూ ఢీకొంటుంటాయి. భూకంపాలు సంభవిస్తుంటాయి. క్రియాశీలక అగ్నిపర్వతాలు అధికంగా ఉన్నాయి ఇక్కడ.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! అమరావతి లో 24,276 కోట్ల పనులకు ఆమోదం! టెండర్ల ప్రక్రియ మొదలు! ఇక వారికి పండగే!

 

ఏపీకి మూడ్రోజుల వర్ష సూచన... ఆ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు!

  

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త! వారి గుండెల్లో నిలిచిపోనున్న CBN! ఒక్కొక్కరికి... ఎప్పటి నుంచి అంటే?

 

ఏపీకి మూడ్రోజుల వర్ష సూచన... ఆ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు!

 

పవన్ హామీని నిలబెడుతున్న చంద్రబాబు - సచివాలయంలో భేటీ! కీలక ఉత్తర్వులు..!

 

2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల! 21 ఐచ్ఛిక సెలవులు..

 

ఏపీలో కొత్త యూనివర్సిటీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఎక్కడ అంటే?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Environment #EarthQuake #PacificOcean #Tsunami