యువ వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలందించాలి! 49 మంది విద్యార్థులకు...!

Header Banner

యువ వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలందించాలి! 49 మంది విద్యార్థులకు...!

  Tue Dec 17, 2024 16:53        Politics

యువ వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలందించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముర్ముకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు స్వాగతం పలికారు. అనంతరం ఎయిమ్కు చేరుకున్న రాష్ట్రపతి.. మొదటి బ్యాచ్గా వైద్య విద్య పూర్తి చేసుకున్న 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.



ఇంకా చదవండిఏపీ ప్రజలకు భారీ శుభవార్త! వారి గుండెల్లో నిలిచిపోనున్న CBN! ఒక్కొక్కరికి... ఎప్పటి నుంచి అంటే?



“వైద్య వృత్తిని ఎంచుకోవడం ద్వారా విద్యార్థులు మానవత్వంతో సేవ చేసే దారిని ఎంచుకున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడి.. వారి ఆరోగ్యం మెరుగుపరిచే అమూల్యమైన అవకాశం మీకు వస్తుంది. మీలాంటి యువ వైద్యులు.. గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. జాతి సమ్మిళిత ఆరోగ్య సంరక్షణలో ప్రత్యేకించి మీలాంటి యువ వైద్యులు కీలక పాత్ర పోషించాలి. ఈ దశలో మీరు చిత్తశుద్ధితో పనిచేసి.. దేశ ఆరోగ్యాభివృద్ధిలో పాలుపంచుకుంటారని ఆశిస్తున్నా” అని రాష్ట్రపతి అన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



ఎయిమ్స్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తాం: చంద్రబాబు
మంగళగిరి ఎయిమ్స్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అత్యాధునిక సేలందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్ దేశంలో మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. మంగళగిరి ఎయిమ్స్ కోసం మరో 10 ఎకరాల స్థలం కేటాయిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేశ్, సత్యకుమార్ పాల్గొన్నారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:



ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా నాలుగు లైన్ల రహదారి ప్రాజెక్టులకు మోక్షం! ఆ రూట్లలోనే..ఆ జిల్లా వారికి పండగ!

  

2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల! 21 ఐచ్ఛిక సెలవులు..

 

ఏపీలో కొత్త యూనివర్సిటీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఎక్కడ అంటే?

  

ఆర్జీవీ నోటి దూల తగ్గలా.. రేవంత్ రెడ్డి పై కారు కూతలు!

 

కావాలని కొట్టలేదు - ఐయామ్ సారీ! జర్నలిస్ట్ సంఘాలకి క్షమాపణలు.. వెంట విష్ణు కూడా..

 

రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!

     

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #doctors #treatments #camp #aiims #poorpeoples #villagecamp #todaynews #flashnews #latestupdate