తెలంగాణ వాదనను వ్యతిరేకించిన ఆంధ్రప్రదేశ్! జల వివాదంపై తెలంగాణ తప్పుదోవ...!

Header Banner

తెలంగాణ వాదనను వ్యతిరేకించిన ఆంధ్రప్రదేశ్! జల వివాదంపై తెలంగాణ తప్పుదోవ...!

  Tue Dec 24, 2024 11:11        Politics

కృష్ణా జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ఇచ్చిన మార్గదర్శకాలను, అంతర్రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 ప్రకారం 2023 అక్టోబరులో ఇచ్చిన తదుపరి సూచనలను కలిపి వినాలన్న తెలంగాణ వాదనను ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించింది. బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్కు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన సమాధానం ప్రకారం.. 'కేంద్రం జారీ చేసిన రెండు నోటిఫికేషన్లు పరస్పరం భిన్నమైనవి. తెలంగాణ వాటిని తప్పుగా అర్థం చేసుకుంది. అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 5(23), 12లోని అధికారాలను వినియోగించుకొని పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89లోని నిబంధన ఎ, బి కింద తదుపరి నివేదిక ఇవ్వాలని 2014 మే 15న కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ.. ట్రైబ్యునల్ను ఆదేశించింది.



ఇంకా చదవండినిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం రూ.50 వేలు!Don'tMiss 



అంతర్రాష్ట్ర జల వివాద చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రైబ్యునల్ ప్రాజెక్టుల వారీ కేటాయింపులు చేయనిపక్షంలో చేయాలని, నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీగా నీటి విడుదలకు ఆఫరేషన్ ప్రొటోకాల్ నిర్ణయించాలని సూచించింది. ఆ ప్రకారం. నిర్ణయించిన తేదీకి ముందు ప్రాజెక్టుల వారీగా ట్రైబ్యునల్ అవార్డులు ఉన్న పక్షంలో.. వాటిని పునర్విభజన ద్వారా ఏర్పడే రాష్ట్రాలు గౌరవించాల్సి ఉంటుంది.దీనికి సంబంధించి సాక్ష్యాల సేకరణ గత ఏడాది మార్చి 23తో ముగిసిన తర్వాత.. సెక్షన్ 89 కింద ప్రధాన కేసు వాదనలు 2023 అక్టోబరు 18న ప్రారంభమయ్యాయి.



ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 



అంతర్రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 ప్రకారం తదుపరి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ను 2023 అక్టోబరు 6న కేంద్రం జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ 2023 అక్టోబరు 31న సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ట్రైబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ వాదనలు వినిపించాలని, రిట్ పిటిషన్ తుది తీర్పునకు లోబడి ఉంటుందని 2023 నవంబరు 7న కోర్టు చెప్పింది. తాము దాఖలు చేసిన రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో తెలంగాణ కోరినట్లుగా రెండూ కలిపి వాదనలు వినడానికి వీల్లేదు. మొదట పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం వేరుగా వాదనలు వినాల్సిన అవసరం ఉంది' అని ఆంధ్రప్రదేశ్ ట్రైబ్యునల్కు విన్నవించింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతులకు మరో చాన్స్‌.. వారికి పంటల బీమా పథకాలు!

 

ప్రియురాలితో జెఫ్ బెజోస్ పెళ్లి! అంత ఖర్చు చేస్తున్నారా? ఈ ఆసక్తికర విషయాలు తెలిస్తే అవాక్!!

 

దేశ రాజధాని ఢిల్లీలో TDP సభ్యత్వ నమోదు కార్యక్రమం! సభ్యత్వంతో సరికొత్త రికార్డు!

 

డబ్బులు వడ్డీకి ఇస్తే జైలు శిక్షే మరియు జరిమానా! ప్రభుత్వం దిమ్మతిరిగే రూల్స్..

 

అల్లు అర్జున్‌ అరెస్ట్ ఎందుకు.. రేవంత్ రెడ్డి పై పురంధేశ్వరి షాకింగ్ కామెంట్స్!

 

ఏపీలో తగ్గిన మద్యం ధరలు! కొత్త రేట్లు చూస్తే.. బాటిల్ దింపరు! ప్రస్తుతం కొత్త మద్యం పాలసీ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #krishna #water #telngana #andhra #todaynews #flashnews #latestupdate