విజయవాడ కోర్టుకు హజరైన ఏపీ , తెలంగాణ నేతలు! 2007 మైనింగ్ కేసులో కీలక విచారణ!

Header Banner

విజయవాడ కోర్టుకు హజరైన ఏపీ , తెలంగాణ నేతలు! 2007 మైనింగ్ కేసులో కీలక విచారణ!

  Tue Dec 24, 2024 18:56        Politics

ఉమ్మడి రాష్ట్రంలో ఓబులాపురం గనుల్లో 2007 జులై 21న అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లిన వారిపై నమోదైన కేసుకు సంబంధించిన విచారణను విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు వచ్చే ఏడాది జనవరి 8వ తేదీకి వాయిదా వేసింది. 21 మందిపై కేసు నమోదు చేయగా.. అందులో ముగ్గురు కేసు విచారణ దశలో ఉండగానే మృతి చెందారు. మిగిలిన అందరూ ఇవాళ విచారణకు హాజరుకావాల్సిందేనని గత విచారణ సమయంలో న్యాయాధికారి ఆదేశించారు. దీంతో అభియోగాలు నమోదైన ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు నాగం జనార్ధన్రెడ్డి, ఎర్రబెల్లి దయకర్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, పడాల అరుణ, అమర్నాథ్ రెడ్డి, వేం నరేందర్రెడ్డి, చిన్నం బాబురమేష్, కోళ్ల లలితకుమారి, బొమ్మడి నారాయణరావు, మసాల పద్మజ, పూల నాగరాజు, ముల్లంగి రామకృష్ణారెడ్డి, గురుమూర్తి, మెట్టు గోవిందరెడ్డి, యలమంచిలి బాబూరాజేంద్రప్రసాద్ ఇవాళ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి ముందు హాజరయ్యారు.


ఇంకా చదవండిబిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారాజనవరి కొత్త రూల్స్తప్పక తెలుసుకోవాల్సిందే!



2007 జులై 21న అనంతపురం జిల్లా డి.హీరేహళ్ మండలంలోని ఓబులాపురం ఇనుప గనుల పరిశీలనకు అప్పటి తెలుగుదేశం నేతలు ఓ బృందంగా వెళ్లినప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు పేర్కొన్న అంశాలపై అభియోగాలు ఎదుర్కొంటున్న నేతల నుంచి 313 స్టేట్మెంట్ను న్యాయాధికారి రికార్డు చేశారు. తమపై తప్పుడు కేసు బనాయించారని, ఎఫ్ఎఆర్లో పొందుపరిచిన విధంగా తాము ఎక్కడా ఎలాంటి నేరానికి పాల్పడలేదని న్యాయాధికారి ప్రశ్నలకు వివరణ ఇచ్చారు. న్యాయస్థానంపై విశ్వాసం ఉందని, కచ్చితంగా న్యాయం గెలుస్తుందని విచారణ అనంతరం అభియోగాలు ఎదుర్కొంటున్న నేతలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో బలమైన నేతల్లో ఒకరైన నాగం జనార్ధన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు తదితరులు కోర్టు కేసులో భాగంగా రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ రావడం, పాత మిత్రులను కలుసుకున్న తరుణంలో ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుని తాజా పరిణామాలపై చర్చించుకున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!

 

రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. నెలకు రూ.3 లక్షల 20 వేల జీతంతో జాబ్, అర్హతలు ఇవే! వారికి జర్మనీ దేశంలో..

 

నేడు (24/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!

 

బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు! ప్రత్యేక రక్షణ చట్టంపై...!

 

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

 

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారాజనవరి కొత్త రూల్స్తప్పక తెలుసుకోవాల్సిందే!

 

డబ్బులు కడితే దొంగ దొర అవుతాడాపదేపదే నీతులు వల్లించే వైసీపీ నేత! మాజీ మంత్రి పై మంత్రి ఫైర్!

 

2025 జనవరితో ఆ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు బంద్! బ్యాకప్ లేకుంటే మీ డాటా పోయినట్టే!

 

USAలో మ‌రో తెలుగు విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి! ఎవరుఎందుకుదీని వెనుక ఎవరి హస్తం!

 

నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #vijayawada #court #inquiry #mining #casefile #todaynews #flashnews #latestupdate