7 సీటర్ కార్ కొనాలి అనుకునే వారికి గుడ్ న్యూస్! అతి తక్కువ ధరతో.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!
Thu Dec 26, 2024 20:55 Auto2025 కొత్త సంవత్సరానికి దగ్గర అవుతున్నాం. కొత్త ఏడాదిలోనూ ఆటోమొబైల్ మార్కెట్లో చాలా వాహనాలు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. వచ్చే ఏడాది భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్న కొత్త 7 సీటర్ ఎస్యూవీల గురించి చూద్దాం.. ఇందులో గ్రాండ్ విటారా 7-సీటర్ నుండి టయోటా ఫార్చ్యూనర్ మైల్డ్ హైబ్రిడ్ ఉన్నాయి. మారుతి గ్రాండ్ విటారా హైబ్రిడ్ ఇంజన్తో మార్కెట్లో ఉంది. మంచి కస్టమర్ బేస్ను పొందింది. అయితే దీనితో కంపెనీ ప్రస్తుతం ఉన్న 5-సీటర్ వెర్షన్ ఆధారంగా 7 సీటర్ మోడల్ను పరిచయం చేస్తుంది. ఇది భారతీయ రోడ్లపై పరీక్ష సమయంలో కూడా కనిపించింది. ఎక్టీరియర్, ఇంటీరియర్ అప్డేట్లతో ఇది మునుపటి కంటే మరింత విశాలంగా ఉంటుంది. ఇది ఇప్పటికే ఉన్న గ్రాండ్ విటారా మాదిరిగానే ఉండబోతోంది. ప్రస్తుతం విక్రయిస్తున్న గ్రాండ్ విటారా తేలికపాటి, బలమైన హైబ్రిడ్ పవర్రెయిన్ ఆప్షన్స్ పొందుతుంది. 7 సీటర్ గ్రాండ్ విటారా వచ్చే ఏడాది ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఇంకా చదవండి: లిమిటెడ్ ఎడిషన్! 24 క్యారెట్ బంగారంతో ఓలా స్కూటర్!
2025 ద్వితీయార్థంలో మార్కెట్లోకి ప్రవేశించవచ్చు. మహీంద్రా ఎవీ 7ఈ కూడా మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇది ఇటీవల ప్రారంభించిన XEV 9e నుండి అనేక విషయాలను పొందవచ్చు. అయితే రేంజ్, మోటార్ వంటి ఇతర సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. కొత్త 7 సీటర్ గ్రాండ్ విటారా తరహాలో అర్బన్ క్రూయిజర్ కూడా మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. రెండు వాహనాలు ఫీచర్లు, మెకానికల్స్ పరంగా ఒకే విధంగా ఉండబోతున్నాయి. అయితే రీబ్రాండింగ్ కోసం, దాని వెలుపలి భాగం కొద్దిగా మార్చే అవకాశం ఉంది. 7 సీటర్ గ్రాండ్ విటారా మార్కెట్లోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత 7 సీటర్ టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ చూడవచ్చు. టయోటా తన ఫార్చ్యూనర్ను హైబ్రిడ్ ఇంజన్తో త్వరలో భారత మార్కెట్లో పరిచయం చేయనుంది. ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్లలో విక్రయంలో ఉన్న ఫార్చ్యూనర్ హైబ్రిడ్ 2.8-లీటర్ డీజిల్ ఇంజన్, 48-వోల్ట్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. తక్కువ ఉద్గారాలతో ఇది మరింత ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కొత్త ఏడాదిలో ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇంకా చదవండి: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో పెన్షనర్లకు శుభవార్త! న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రభుత్వం కీలక నిర్ణయం!
జగన్ ఇంటి ముందు ధర్నా చేయాలి.. ప్రపంచంలో ఇంత వింత ఎక్కడా! మంత్రి మండిపాటు!
రేవంత్ రెడ్డికి కీలక ప్రతిపాదనలు చేసిన సినీ ప్రముఖులు! ప్రస్తుత ప్రభుత్వంపై.. అవేంటంటే!
ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.. వాటిపై 90 శాతం రాయితీ! వెంటనే పొందండి..
తిరుమల భక్తులకు శుభవార్త! గంటలోనే శ్రీవారి దర్శనం - అమల్లోకి టీటీడీ కొత్త విధానం!
పీఆర్, పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..
ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!
అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!
నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #NewCar #Offer #MarutiSuzuki
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.