విశాఖపట్నం కేంద్ర కారాగారంలో మరో సంచలనం ఘటన! ప్యాకింగ్ బయటపడగా... తెరచి చూస్తే!

Header Banner

విశాఖపట్నం కేంద్ర కారాగారంలో మరో సంచలనం ఘటన! ప్యాకింగ్ బయటపడగా... తెరచి చూస్తే!

  Fri Jan 03, 2025 17:30        Others

విశాఖపట్నం కేంద్ర కారాగారంలో మరోసారి సెల్ఫోన్ బయటపడటం సంచలనంగా మారింది. నర్మదా బ్లాక్ వద్ద శుక్రవారం అధికారులు తనిఖీలు చేస్తుండగా.. సెల్ఫోన్ లభ్యమైంది. స్టోరూమ్ ఫ్లోరింగ్ మార్బుల్ కింద కీ ప్యాడ్ మొబైల్ను ప్యాక్చేసి పెట్టారు. తనిఖీల సందర్భంగా అధికారులకు అనుమానం రావడంతో ఆ ప్రాంతంలో తవ్వి చూడగా సెల్ఫోన్ బయటపడింది. తనిఖీల్లో భాగంగానే సెల్ఫోన్ గుర్తించామని ఎస్పీ మహేశ్ బాబు తెలిపారు.


ఇంకా చదవండిఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్! 6 లేన్లతో హైవేకు రూ.1000 కోట్లు మంజూరు!



పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే మరోసారి..
విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదీలుండే పెన్నా బ్యారక్ సమీపంలో పూల కుండీల వద్ద డిసెంబరు 31న జైలు అధికారులు అనుమానంతో తనిఖీ చేశారు. అక్కడ కట్టుదిట్టమైన ప్యాకింగ్ బయటపడగా... తొలుత గంజాయిగా భావించారు. తెరచి చూస్తే అందులో రెండు సెల్ ఫోన్లు, ఒక బ్యాటరీ, ఒక పవర్ బ్యాంకు గుర్తించారు. గొయ్యి తీసి ఫోన్లు ఉన్న కవరు అందులో పెట్టి పూడ్చి, రెండు రాళ్లతో కప్పి ఆపైన పూల కుండీలను పెట్టినట్లు తేలింది. విషయాన్ని జైళ్లశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారి సూచనతో ఆరిలోవ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజా పరిణామాలు, కేసు నేపథ్యంలో విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ నేరుగా రంగంలోకి దిగారు. దొరికిన సెల్ఫోన్లలో సిమ్కార్డుల్లేవు. ఈ సిమ్కర్డులు ఎక్కడ దాచారో పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. అవి బయటపడితే కాల్ లిస్టు ఆధారంగా ఎవరు ఎవరితో మాట్లాడారనే విషయాలు వెలుగులోకి వస్తాయి. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే తాజాగా శుక్రవారం మరో సెల్ఫోన్ బయటపడటం సంచలనంగా మారింది.



ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:



కొత్త ఏడాదిలో మరో కొత్త స్కీమ్! రూ.
500 ఉంటే చాలు! జనవరి 16 వరకే ఛాన్స్!
 

 

ఆకాశమే హద్దుగా కుప్పం అభివృద్ధి.. అన్నింటా అద్భుతం! సాంకేతిక ప్రణాళికలు సిద్ధం! 

 

గూగుల్ పేఫోన్‌పే వంటి యాప్స్ వాడుతున్నారాఇక ఆ UPI ఐడీలు పని చేయవు! 

 

శబరిమల వెళ్ళేవారికి సూపర్ గుడ్ న్యూస్! గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం రంగం సిద్ధం! 

 

ఏపీ క్యాబినెట్ భేటీలో సీఏం చంద్రబాబు కీలక నిర్ణయాలు! ఆ పథకాల అమలుకు ముహూర్తం ఫిక్స్! 

 

టీడీపీ కార్యకర్తలకు మంత్రి లోకేష్ గుడ్ న్యూస్! దేశ చరిత్రలో తొలిసారి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #vizag #jail #centraljail #secretephones #todaynews #flashnews #latestupdate