ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు!

Header Banner

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు!

  Fri Jan 03, 2025 17:38        Politics

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ఫలితాల మెరుగుదలకు పలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం' అమలు చేయాలని నిర్ణయించారు. రేపు (జనవరి 4) విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి లోకేశ్ లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు 398 పాఠశాలలు అనుసంధానమై ఉండగా, అక్కడ భోజనాలను తయారు చేస్తారు. మిగిలిన 77 కళాశాలలను కేంద్రీకృత వంటశాలలకు అనుసంధానించారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఈ ఏడాది రూ.27.39 కోట్లు, వచ్చే విద్యాసంవత్సరంలో రూ.85.84 కోట్లు ఖర్చుచేయనున్నారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు (3/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్ అరెస్టు, అమెరికా కోర్టులో అభియోగాల తర్వాత ఈ ఒప్పందం! చంద్రబాబు ఏమన్నారంటే?

 

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్! 6 లేన్లతో హైవేకు రూ.1000 కోట్లు మంజూరు!

 

కొత్త ఏడాదిలో మరో కొత్త స్కీమ్! రూ.500 ఉంటే చాలు! జనవరి 16 వరకే ఛాన్స్!

ఆకాశమే హద్దుగా కుప్పం అభివృద్ధి.. అన్నింటా అద్భుతం! సాంకేతిక ప్రణాళికలు సిద్ధం!

గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్స్ వాడుతున్నారా? ఇక ఆ UPI ఐడీలు పని చేయవు!

శబరిమల వెళ్ళేవారికి సూపర్ గుడ్ న్యూస్! గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం రంగం సిద్ధం!

ఏపీ క్యాబినెట్ భేటీలో సీఏం చంద్రబాబు కీలక నిర్ణయాలు! ఆ పథకాల అమలుకు ముహూర్తం ఫిక్స్!

టీడీపీ కార్యకర్తలకు మంత్రి లోకేష్ గుడ్ న్యూస్! దేశ చరిత్రలో తొలిసారి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting