రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్​ ఫోన్లు ఇవే! వాటి ధరలు మారే అవకాశం.. Don't Miss!

Header Banner

రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్​ ఫోన్లు ఇవే! వాటి ధరలు మారే అవకాశం.. Don't Miss!

  Fri Jan 03, 2025 18:24        Gadgets

ఎలక్ట్రానిక్స్ రంగంలో శాంసంగ్ కంపెనీకి ఎంతో గుర్తింపు ఉంది. అదే స్థాయిలో స్మార్ట్ ఫోన్ల తయారీలోనూ మంచి పేరు సాధించింది. యాపిల్ ఐఫోన్ కు దీటుగా శాంసంగ్ ఫోన్లను తయారు చేస్తోంది. అదే సమయంలో సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండేలా బడ్జెట్ ఫోన్లనూ ప్రవేశపెట్టింది. అందులో రూ.10 వేలలోపు ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ శాంసంగ్ ఫోన్లను టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎం05..
కేవలం రూ.6,999 ధరకే అందుబాటులో ఉన్న బడ్జెట్ ఫోన్ ఇది. ఫ్లిప్ కార్ట్ లో లభిస్తుంది. దీనిలో 6.7 అంగుళాల ఎల్ సీడీ స్క్రీన్మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.


శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 14..
అమెజాన్ లోనే రూ.8,748 ధరతో అందుబాటులో ఉంది. ఇందులో 6.6 అంగుళాల పీఎల్ఎస్ ఎల్సీడీ స్క్రీన్, 90 గిగాహెడ్జ్ రీఫ్రెష్ రేటును సపోర్టు చేస్తుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. వెనుకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాతో డ్యూయల్ కెమెరా ఉంది. బడ్జెట్ ధరలో ఇది బెటర్ ఫోన్ అని నిపుణులు పేర్కొంటున్నారు.


ఇంకా చదవండి: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు!


శాంసంగ్ గెలాక్సీ ఎం14..
ఇది కూడా అమెజాన్ లో రూ.8,410 ధరతో అందుబాటులో ఉంది. దీనిలోనూ 6.6 అంగుళాల పీఎల్ఎస్ ఎల్సీడీ స్క్రీన్, 90 గిగాహెడ్జ్ రీఫ్రెష్ రేటును సపోర్టు చేస్తుంది. ఇందులో 6000 ఎంఏహెచ్ పెద్ద బ్యాటరీ ఉంది. వెనుకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాతో త్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 

శాంసంగ్ గెలాక్సీ ఏ06..
ఈ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ లో రూ.8,799 కే అందుబాటులో ఉన్న ఈ ఫోన్ లో 6.7 అంగుళాల డిస్ ప్లేమీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ05..
6.7
అంగుళాల పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్ ప్లే ఉన్న ఈ ఫోన్ లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ లో రూ.7,835 ధరతో లభిస్తుంది. బడ్జెట్ ఫోన్లలో ఇది మంచి ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఆర్టికల్ లో పేర్కొన్న ఫోన్లు, వాటి స్పెసిఫికేషన్లు, ధరలు టెక్ నిపుణులు వెల్లడించిన వివరాల మేరకు పేర్కొన్నవే. సమయానుసారం వాటి ధరలు మారే అవకాశం ఉంటుంది. వాటిని గమనించాలి.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు (3/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్ అరెస్టు, అమెరికా కోర్టులో అభియోగాల తర్వాత ఈ ఒప్పందం! చంద్రబాబు ఏమన్నారంటే?

 

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్! 6 లేన్లతో హైవేకు రూ.1000 కోట్లు మంజూరు!

 

కొత్త ఏడాదిలో మరో కొత్త స్కీమ్! రూ.500 ఉంటే చాలు! జనవరి 16 వరకే ఛాన్స్!

ఆకాశమే హద్దుగా కుప్పం అభివృద్ధి.. అన్నింటా అద్భుతం! సాంకేతిక ప్రణాళికలు సిద్ధం!

గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్స్ వాడుతున్నారా? ఇక ఆ UPI ఐడీలు పని చేయవు!

శబరిమల వెళ్ళేవారికి సూపర్ గుడ్ న్యూస్! గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం రంగం సిద్ధం!

ఏపీ క్యాబినెట్ భేటీలో సీఏం చంద్రబాబు కీలక నిర్ణయాలు! ఆ పథకాల అమలుకు ముహూర్తం ఫిక్స్!

టీడీపీ కార్యకర్తలకు మంత్రి లోకేష్ గుడ్ న్యూస్! దేశ చరిత్రలో తొలిసారి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #SamsungOffer #SamsungGalaxyM145G #SamsungGalaxyBigOffer #BigOfferInSamsung #5GPhone #SamsungGalaxyM14Phone