ఇన్ఫోసిస్ సహకారంతో 'ఏపీ ల్యాబ్ ఆన్ వీల్స్'.. లక్ష్యం ఇదే! ప్రతిరోజూ 20 మంది విద్యార్థులతో..

Header Banner

ఇన్ఫోసిస్ సహకారంతో 'ఏపీ ల్యాబ్ ఆన్ వీల్స్'.. లక్ష్యం ఇదే! ప్రతిరోజూ 20 మంది విద్యార్థులతో..

  Fri Jan 03, 2025 18:54        Politics

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహకారంతో ఏపీ-మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ ను ఏపీ  ప్రభుత్వం మంగళగిరిలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని విద్యార్థులకు భవిష్యత్ సాంకేతికతను వివరించే లక్ష్యంతో ప్రారంభించనున్న ఈ నమూనా వాహనాన్ని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో నేడు పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టుగా ఈ వాహనం మంగళగిరిలోని పాఠశాలలకు వెళ్లి పిల్లల్లో అవగాహన కల్పిస్తుంది. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని స్కూళ్లకు ఇటువంటి వాహనాలను పంపిస్తారు. పరివర్తనాత్మక నైపుణ్య అవకాశాలను విద్యార్థుల వద్దకే తీసుకెళ్లేందుకు ఇన్ఫోసిస్‌ భాగస్వామ్యం కావడం అభినందనీయమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా విజన్, ESG విజన్ 2030 ( ఎన్విరాన్ మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్) లక్ష్యాలకు అనుగుణంగా మారుమూల ప్రాంతాలకు ఉచిత డిజిటల్, STEM లెర్నింగ్ అవకాశాలను అందించడం మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ లక్ష్యం. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ – ఇన్ఫోసిస్ సంయుక్త సహకారంతో ఏపీ-మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభిస్తారు. ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, మైక్రో కంట్రోలర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగాలపై ల్యాబ్ ఆన్ వీల్స్ ద్వారా విద్యార్థులకు బేసిక్ స్కిల్ అందించడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. 

 

ఇంకా చదవండి: కర్నాటక బస్సులో ఏపీ మంత్రులు.. ఏం చేశారంటే! మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు!

 

ఏపీ మేకర్ ల్యాబ్‌లో 90 నిమిషాల వ్యవధిలో ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెషన్ ఉంటుంది. తర్వాత విద్యార్థుల ఆసక్తిని బట్టి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డు ప్లాట్‌ఫామ్ ద్వారా ఉచితంగా వివిధ కోర్సులు నేర్చుకోవడానికి అవకాశం కల్పించి, వరల్డ్ క్లాస్ టెక్నాలజీ సర్టిఫికేషన్ అందజేస్తారు. మొబైల్ ల్యాబ్‌లో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్ లు, వర్క్‌స్టేషన్‌లు, ప్రయోగాల కోసం కిట్‌లతో సహా అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం ఇన్ఫోసిస్ సంస్థ రూ.5 కోట్లతో ల్యాబ్ తో కూడిన బస్సు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఏడాది రూ. 40 లక్షల నిర్వహణ వ్యయాన్ని భరించడమేగాక విద్యార్థులకు కోర్సు కంటెంట్ తో పాటు ట్రైనర్ సపోర్టు అందిస్తుంది. ఇందుకోసం ఇన్ఫోసిస్ సంస్థ ఒక్కో విద్యార్థికి సగటున రూ.1,500 ఖర్చుచేస్తుంది. ఈ కార్యక్రమం కింద ప్రతి మూడు నెలలకు 4,800 మంది విద్యార్థులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిరోజూ 20 మంది విద్యార్థులతో కూడిన 4 బ్యాచ్‌లకు అవగాహన కల్పించాలన్నది ప్రధాన లక్ష్యమని ఇన్ఫోసిస్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో  నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ జి. గణేశ్ కుమార్, ఇన్ఫోసిస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు!

 

నేడు (3/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్ అరెస్టు, అమెరికా కోర్టులో అభియోగాల తర్వాత ఈ ఒప్పందం! చంద్రబాబు ఏమన్నారంటే?

 

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్! 6 లేన్లతో హైవేకు రూ.1000 కోట్లు మంజూరు!

 

కొత్త ఏడాదిలో మరో కొత్త స్కీమ్! రూ.500 ఉంటే చాలు! జనవరి 16 వరకే ఛాన్స్!

ఆకాశమే హద్దుగా కుప్పం అభివృద్ధి.. అన్నింటా అద్భుతం! సాంకేతిక ప్రణాళికలు సిద్ధం!

గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్స్ వాడుతున్నారా? ఇక ఆ UPI ఐడీలు పని చేయవు!

శబరిమల వెళ్ళేవారికి సూపర్ గుడ్ న్యూస్! గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం రంగం సిద్ధం!

ఏపీ క్యాబినెట్ భేటీలో సీఏం చంద్రబాబు కీలక నిర్ణయాలు! ఆ పథకాల అమలుకు ముహూర్తం ఫిక్స్!

టీడీపీ కార్యకర్తలకు మంత్రి లోకేష్ గుడ్ న్యూస్! దేశ చరిత్రలో తొలిసారి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting