HDFC నుంచి మరో 2 కొత్త పథకాలు! రూ.100 ఉంటే చాలు! పూర్తి వివరాలు ఇవే!

Header Banner

HDFC నుంచి మరో 2 కొత్త పథకాలు! రూ.100 ఉంటే చాలు! పూర్తి వివరాలు ఇవే!

  Fri Jan 03, 2025 20:47        Business

ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారి కోసం మరో రెండు కొత్త స్కీమ్స్ తీసుకొస్తోంది హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్స్. ఆయా స్కీమ్స్‌కి సంబంధించి ముసాయిదా పత్రాలను సెబీ వద్ద సమర్పించింది. త్వరలోనే ఈ స్కీమ్స్ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులోకి రానుంది. ఇందలో కనీస పెట్టుబడి రూ.100 నుంచి మొదలవుతోంది. ఈ రెండు పథకాల గురించి ఇప్పుడే మనం తెలుసుకుందాం.

 

ప్రముఖ అసెట్ మెనేజ్మెంట్ సంస్థల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ పెట్టుబడిదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మ్యూచువల్ ఫండ్స్‌లో మరో రెండు కొత్త పథకాలను తీసుకొస్తున్నట్లు తెలిపింది. రెండు పాసివ్ ఫండ్స్‌కు సంబంధించిన ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించింది. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించగానే సబ్‌స్క్రిప్షన్‌కి తీసుకురానుంది. ఇందుకు చాలా తక్కువ సమయమే పడుతుందని చెప్పవచ్చు. మరి ఈ రెండు పథకాల గురించి ఇప్పుడే మనం తెలుసుకుందాం.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిఈ పండ్లు వేర్వేరుగా తింటేనే ఆరోగ్యానికి మంచిది! కలిపి తింటే ఇంక అంతే! 

 

కొత్తగా తీసుకొస్తున్న రెండు పాసివ్ ఫండ్స్‌లో మొదటిది హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్ ఫండ్. ఇక రెండోది హెచ్‌డీఎఫ్‌సీ క్రిసిల్ ఐబీఎక్స్ ఏఏఏ బాండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ సెప్టెంబర్ 2027 ఫండ్. ఇందులో మొదటి స్కీమ్ గురించి పరిశీలిస్తే ఇది ఒక ఓపెన్ ఎండెడ్ స్కీమ్. ఇది నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్ బెంచ్‌మార్క్ కలిగి ఉంది. నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్‌ ఆధారంగా దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త ఫండ్ తీసుకొస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. ఈ పథకాన్ని నిర్మాన్ మొరాఖియా, అరుణ్ అగర్వాల్ నిర్వహిస్తారని తెలిపింది.

 

ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ.100గా నిర్ణయించినట్లు తెలిపింది. ఆ తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్‌లో పెట్టే డబ్బులో 95-100 శాతం నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్‌లోని సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయనుంది. అలాగే 0-5 శాతం డెట్ సెక్యూరిటీలు, మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్స్, డెట్ స్కీమ్స్ యూనిట్లలో ఇన్వెస్ట్ చేయనుంది.

 

ఇక రెండో స్కీమ్ హెచ్‌డీఎఫ్‌సీ క్రిసిన్ ఐబీఎక్స్ ఏఏఏ బాండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ సెప్ 2027 ఫండ్ విషయానికి వస్తే ఇది సైతం ఒక ఓపెన్ ఎండెడ్ స్కీమ్. దీని బెంచ్ మార్క్ ఇండెక్స్ క్రిసిల్ ఐబీఎక్స్ ఏఏఏ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ Sep2027గా ఉంది. మధ్యస్త వడ్డీ రేటు రిస్క్, లో క్రెడిట్ రిస్క్ కలిగి ఉంటుంది. ఈ పథకాన్ని అనుపమ్ జోషి నిర్వహిస్తారు. ఇందులో కనీస పెట్టుబడి సైతం రూ.100గా ఉంది. ఈ స్కీమ్‌లోని పెట్టుబడుల్లో 95-100 శాతం క్రిసిల్ ఐబీఎక్స్ ఏఏఏ ఫైనాన్షియస్ సర్వీస్ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక 0-5 శాతం డెట్ సెక్యూరిటీలు, మనీ మార్కెట్, డెట్ స్కీమ్స్ లో పెట్టుబడి పెడతారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కొత్త ఏడాదిలో మరో కొత్త స్కీమ్! రూ.500 ఉంటే చాలు! జనవరి 16 వరకే ఛాన్స్! 

 

ఆకాశమే హద్దుగా కుప్పం అభివృద్ధి.. అన్నింటా అద్భుతం! సాంకేతిక ప్రణాళికలు సిద్ధం! 

 

గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్స్ వాడుతున్నారా? ఇక ఆ UPI ఐడీలు పని చేయవు! 

 

శబరిమల వెళ్ళేవారికి సూపర్ గుడ్ న్యూస్! గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం రంగం సిద్ధం! 

 

ఏపీ క్యాబినెట్ భేటీలో సీఏం చంద్రబాబు కీలక నిర్ణయాలు! ఆ పథకాల అమలుకు ముహూర్తం ఫిక్స్! 

 

టీడీపీ కార్యకర్తలకు మంత్రి లోకేష్ గుడ్ న్యూస్! దేశ చరిత్రలో తొలిసారి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Business #Investments #Schemes #Government