ప్రయాణికులకు శుభవార్త: మరో రైలు మార్గానికి గ్రీన్ సిగ్నల్.. ఈ ప్రాంతాలన్నింటికీ కొత్త రైల్వేస్టేషన్లు..

Header Banner

ప్రయాణికులకు శుభవార్త: మరో రైలు మార్గానికి గ్రీన్ సిగ్నల్.. ఈ ప్రాంతాలన్నింటికీ కొత్త రైల్వేస్టేషన్లు..

  Mon Jan 06, 2025 08:00        Politics

హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాలంటే వరంగల్, విజయవాడ, తెనాలి మీదుగా ఒక మార్గం ఉంది. గుంటూరు, తెనాలిమీదుగా మరో మార్గం, కాచిగూడ నుంచి మహబూబ్ నగర్ మీదుగా మరో మార్గం ఉంది. ఇవి కాకుండా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ మార్గంగా నడికుడి-శ్రీకాళహస్తి మార్గం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం నడికుడి జంక్షన్. ఇక్కడి నుంచి మాచర్ల వెళ్లవచ్చు. అలాగే గుంటూరు వైపు, సికింద్రాబాద్ వైపు వెళ్లవచ్చు. ఈ ప్రాజెక్టులో భాగంగా గుండ్లకమ్మ-దర్శి మధ్య 27 కిలోమీటర్ల రైల్వేలైను ఇటీవలే పూర్తయింది. తాజాగా దర్శి నుంచి పొదిలి వరకు నిర్మించిన రైల్వే లైను ను అధికారులు పరిశీలించారు. గూడ్స్ రైలుతో ట్రయల్ రన్ పూర్తయింది. పొదిలికి సమీపంలోని మల్లవరం వరకు నిర్మాణం పూర్తికాగా అక్కడి నుంచి పొదిలికి మార్గం పూర్తవలేదు. మధ్యలో స్థలం ఉన్న రైతు కోర్టుకు వెళ్లడంతో నిర్మాణం ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సంబంధిత రైతుతో మాట్లాడి అక్కడి సమస్యను పరిష్కరించాలని అధికారులు కోరుతున్నారు. ఆ రైతువల్ల 200 మీటర్ల రైల్వే మార్గం నిర్మాణం ఆగిపోయింది.

 

ఇంకా చదవండి: గన్నవరంలో కొత్త టెర్మినల్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్! కొత్తగా మరో 7 విమానాశ్రయాలు!

 

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నడికుడి నుంచి ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లోని వెనకబడిన ప్రాంతాలను కలుపుతూ ఈ మార్గం నిర్మాణమవుతోంది. ఈ మార్గం శ్రీకాళహస్తి దగ్గర కలుస్తుంది. 309 కిలోమీటర్ల రైల్వే మార్గం ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.2300 కోట్లుగా ఉంది. ఈ మార్గంలో అన్నీ కొత్త రైల్వేస్టేషన్లే వస్తాయి. ఇటీవలే దర్శి వరకు ప్యాసింజర్ రైలు నడిపారు. ఇది కూడా విజయవంతమైంది. నడికుడి నుంచి శావల్యాపురం వరకు, దర్శి, అద్ధంకి దగ్గర కూడా స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ మార్గం నడికుడి, పిడుగురాళ్ల, వినుకొండ, శావల్యాపురం, దర్శి, అద్దంకి, పొదిలి, కనిగిరి, పామూరు, వింజమూరు, ఆత్మకూరు, రాపూరు, వెంకటగిరి మీదుగా వెళ్లి శ్రీకాళహస్తి దగ్గర కలుస్తుంది. పిడుగురాళ్ల, వినుకొండ, నడికుడి మినహా మిగతావన్నీ కొత్త రైల్వేస్టేషన్లు. ఈ ప్రాంతాలన్నీ ఆర్థికంగా అభివృద్ధి చెందడంతోపాటు సరకు రవాణా వేగవంతం అవుతుంది. ఎర్రమట్టి నేల కావడంతో ప్రకృతి విపత్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. విజయవాడ నుంచి చెన్నై మార్గంలో వర్షాల వల్ల పట్టాలు మునిగిపోతే ప్రత్యామ్నాయంగా ఈ మార్గంలో రైళ్లు నడపవచ్చని అధికారులు చెబుతున్నారు.

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో కొత్త వైరస్ కేసులు.. వ్యాధి లక్షణాలు 3 నుంచి 10 రోజుల్లోగా..! ఆరోగ్యశాఖ స్పందన ఇదే..

అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే..

పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్!

ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్!

ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు..

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! ఎప్పుడు? ఎందుకు..?

లోకేశ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు భారీ శుభవార్త! ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. అకౌంట్లోకి డబ్బులు, చెల్లింపు ఇలా!

పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్..

లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా..

ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి!

ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!

గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు! ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ప్రస్తుతం స్టేటస్ ఏంటంటే!

ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు..

తల్లికి వందనం పథకం అమలుకు డేట్ ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!

నేడు (4/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #NewtrainLine #AndhraPradesh #Modi #Government #MPరామ్మోహన్.నాయుడు