ఏపీ ప్రభుత్వం తీపికబురు.. అమరావతి పరిధిలోని 9 గ్రామాలు.. వారికి అకౌంట్‌లలో డబ్బులు జమ! మొత్తం 20 ఇంజనీరింగ్ పనులు..

Header Banner

ఏపీ ప్రభుత్వం తీపికబురు.. అమరావతి పరిధిలోని 9 గ్రామాలు.. వారికి అకౌంట్‌లలో డబ్బులు జమ! మొత్తం 20 ఇంజనీరింగ్ పనులు..

  Fri Jan 10, 2025 07:00        Politics

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాజధాని ప్రాంతంలో రైతులకు కౌలు, పింఛన్ల కోసం 2024-25లో నాలుగో విడత కింద నిధులు విడుదలయ్యాయి. ఈ మేరకు అమరావతి రైతుల కౌలు, భూమిలేని వారికి పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.255 కోట్లు వేర్వేరుగా విడుదల చేసింది. సీఆర్డీఏ కమిషనర్‌ ప్రతిపాదనలపై పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ డబ్బుల్ని లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌లలోకి జమ చేస్తారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో అభివృద్ధి పనుల్ని వేగవంతం చేస్తోంది. రాజధానిలో రూ.11,467 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో చర్చించిన పనులను చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

 

ఇంకా చదవండి: క్షతగాత్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న చంద్రబాబు! 40 మంది వరకు భక్తులు..

 

అమరావతిలో మొత్తం 20 ఇంజనీరింగ్ పనులు చేపట్టేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చింది.. ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే అమరావతిలో నిర్మాణ పనుల్లో స్పీడ్ పెరిగింది.. సీఆర్డీఏ, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్లు ఈ పనులకు సంబంధించి వరుసగా టెండర్లు ఆహ్వానిస్తున్నారు. గతవారం రూ.2,514 కోట్ల అంచనాలతో అమరావతిలోని పనులకు టెండర్లను పిలిచారు. అమరావతిలో సీవరేజి, అవెన్యూ ప్లాంటేషన్, గెజిటెడ్ అధికారులు, క్లాస్ 4 ఉద్యోగుల అపార్ట్‌మెంట్లలో మిగిలిన పనులు, రోడ్ల నిర్మాణం లాంటి ట్రంక్ ఇన్‌ఫ్రాతో పాటు, భూగర్భ విద్యుత్ కేబుళ్ల కోసం యుటిలీటీ డక్ట్‌లు, వరద నీటి కాలువలు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించారు.

 

ఇంకా చదవండి: వాకింగ్ సమయంలో చాలా మంది చేస్తున్న తప్పులివే! గుండెకి ప్రమాదమని తెలుసా?

 

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను లాటరీ పద్దతిలో కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ ప్లాట్లను వీలైనంత త్వరగా అప్పగించడానికి సీఆర్డీఏ కసరత్తు చేస్తోంది. రాజధాని గ్రామాల రైతులతో సంప్రదింపులు జరుపుతోంది.. ఈ మేరకు ఈ ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని సీఆర్డీఏ అధికారులు ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు. దాదాపు 3000ల ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తికాగా.. అమరావతి పరిధిలోని 9 గ్రామాలకు సంబంధించి సీఆర్డీఏ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉంది.. ఈ మేరకు అవసరమైన సిబ్బందిని నియమించారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!

 

పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!

 

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలు, సూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వం, చంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews