సీఎం చంద్రబాబును కలిసిన వివిధ దేశాలకు చెందిన ఎన్నారైలు! ఎన్ఆర్ఐ టిడిపి సెల్ ఆధ్వర్యంలో!

Header Banner

సీఎం చంద్రబాబును కలిసిన వివిధ దేశాలకు చెందిన ఎన్నారైలు! ఎన్ఆర్ఐ టిడిపి సెల్ ఆధ్వర్యంలో!

  Fri Dec 20, 2024 11:21        Europe, U S A, Australia, Malaysia , Bahrain

ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు.

ఇటీవల జరిగిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించింది. ఈ ఎన్నికలకు ఎన్నారైలు ఎంతో కష్టపడ్డారు. ఎన్నికలకు నెలలు ముందుగా భారత్ కు వచ్చి పార్టీ విజయానికి తోడ్పడ్డారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం చంద్రబాబు వారానికి ఒక సారి ఎన్నారైలను కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. 

 

అందులో భాగంగా ఈ వారం ఆస్ట్రేలియా, అమెరికా, బహరైన్, యూకే, బ్రూనై మరియు మలేషియా నుండి వచ్చిన ఎన్నారైలు ఎన్ఆర్ఐ టిడిపి సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును కలవడం జరిగింది. అక్కడ సీఎం చంద్రబాబు ఎన్నారై లను కలిసి వారిని అభినందించారు. 

 

ఇంకా చదవండిఏపీ కూట‌మి ప్ర‌భుత్వం వినూత్న నిర్ణ‌యం! డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు! 18 నుంచి 60 ఏళ్ల లోపు.. 

 

ఇంకా చదవండిరేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈరోజు కలిసిన వారి వివరాలకు లోకి వెళితే ఆస్ట్రేలియా నుండి లగడపాటి సుబ్బారావుమరియు మల్లికార్జున్, అమెరికా నుండి యష్ మరియు అనురాధ, మలేషియా నుండి ప్రదీప్ కుమార్, బహరైన్ నుండి టీ హరిబాబు, యూకే నుండి అరుణ్ కుమార్, రమణ మరియు వారి కుటుంబ సభ్యులు లు సీఎం చంద్రబాబు గారిని కలిశారు. ఇలా సీఎం గారు తమ కోసం సమయం కేటాయించి వారిని కలిసి విదేశాలలో వారు చేస్తున్న పనుల గురించి ఓపిగ్గా అడిగి తెలుసుకుని, వారు వారు పార్టీకి చేసిన కృషిని అభినందించడం ఎంతో సంతోషంగా ఉందని ఎన్నారైలు మరియు వారి కుటుంబ సభ్యులు ఆనందాన్ని వెల్లడించారు. 

 

అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించేందుకు దేశ విదేశాల నుంచి తెలుగు ప్రజలు ముందు కొస్తున్నారు. గురువారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును మెల్బోర్న్ తెలుగుదేశం నేతలు కలిశారు. తెలుగుదేశం పార్టీ మెల్బోర్న్ తరపున సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.3 లక్షల విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని తెలుగుదేశం మెల్బోర్న్ అధ్యక్షుడు సుబ్బరావు లగడపాటి, రామ్ ముప్పనేని, ప్రకాశ్ మారితి ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సంద ర్భంగా సీఎం చంద్రబాబు వారిని అభినందించారు.

 

ఎన్నికల కోసం ఎంతో కష్టపడిన ఎన్నారై లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వారంలో ఒక రోజు సమయం ఇచ్చి సీఎం గారి బిజీ షెడ్యూల్ లో వారి కోసం సమయం కేటాయించి వారిని కలిసి అభినందనలు తెలియజేయడం ఎన్నారైలకు ఎంతో ఆనందం అని ఎన్నారై టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ అన్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

USA: H1B వీసా కొత్త రూల్స్ ఇవే.. ఉద్యోగస్తులు కచ్చితంగా అలా చేయాల్సిందే! మరో 20వేల వీసాలను జారీ!

 

నేడు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మంత్రులకు చంద్రబాబు ర్యాంకులు - పవన్లోకేష్ స్థానాలు ఇవే! నాగబాబు చేరిక పై..

 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు! 21 అంశాలపై...!

 

జనసేన లీగల్ సెల్ లో కీలక నియామకం! పార్టీ జనరల్ కౌన్సిల్ గా ఎవరు అంటే!

 

జగన్ కు ఊహించని షాక్! మాజీ మంత్రితో పాటు పలువురు వైకాపా నేతలపై కేసు నమోదు.. కారణం ఇదే!

 

ఆర్జీవీకి అక్రమ చెల్లింపులు... జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఎందుకుఎంత అంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Associations #UK #USA #Malaysia #Brunei #Australia