భారత్-అమెరికా రక్షణ సంబంధాలు బలోపేతం...! కీలక ఒప్పందాలతో వేగంగా పురోగతి!

Header Banner

భారత్-అమెరికా రక్షణ సంబంధాలు బలోపేతం...! కీలక ఒప్పందాలతో వేగంగా పురోగతి!

  Fri Dec 20, 2024 11:29        India, U S A

భారత్, అమెరికా (India-USA) రక్షణ సంబంధాలు అద్భుతమైన మార్గాల్లో ముందుకుసాగుతున్నాయని పెంటగాన్ తెలిపింది. ఈమేరకు ఇండో పసఫిక్ భద్రతా వ్యవహారాల కార్యదర్శి ఎలీ రాట్నర్ పేర్కొన్నారు. ‘అమెరికా- భారత్ల మధ్య మంచి రక్షణ సంబంధాలు కలిగిఉన్నాయి. ఇది రక్షణ పారిశ్రామిక సహకారంతో పాటు కార్యాచరణ సహకారానికి సంబంధించింది. ఇది అద్భుతమైన, ఉత్తేజకరమైన మార్గాల్లో వేగంగా పురోగమిస్తోంది' అని తెలిపారు. ఇటీవల 31 ఎంక్యూ-9బీ ప్రీడేటర్ డ్రోన్లను తక్కువ మొత్తంలో అందించేందుకు అమెరికా (USA) ముందుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఈ ఏడాది ఇరుదేశాల మధ్య పలు రక్షణ పరికరాల సరఫరాకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి.



ఇంకా చదవండిసీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు! 21 అంశాలపై...!



భారత్కు చెందిన సంస్థపై అమెరికా ఆంక్షలు..
మరోవైపు.. భారత్ (India)కు చెందిన ఓ సంస్థపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరానియన్ పెట్రోలియం, పెట్రో కెమికల్స్ తో కలిసి వ్యాపారం చేస్తోందని అట్లాంటిక్ నావిగేషన్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ పై అగ్రరాజ్యం (USA) ఆంక్షలు విధించింది. దీంతోపాటు ఇరాన్ (Iran)కు బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుస్తున్న నాలుగు సంస్థలు, మూడు నౌకలపైనా ఆంక్షలు విధించినట్లు ట్రెజరీ శాఖ పేర్కొంది. టెహ్రాన్ తన అణు కార్యక్రమాల అభివృద్ధికి, ఆయుధ వ్యవస్థల విస్తరణకు దాని ప్రాక్సీలకు మద్దతు ఇచ్చేందుకు ఈ నౌకలు, కంపెనీలపై ఆధారపడుతోందని వెల్లడించింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



జనసేన లీగల్ సెల్ లో కీలక నియామకం! పార్టీ జనరల్ కౌన్సిల్ గా ఎవరు అంటే!

 

జగన్ కు ఊహించని షాక్! మాజీ మంత్రితో పాటు పలువురు వైకాపా నేతలపై కేసు నమోదు.. కారణం ఇదే!

 

ఆర్జీవీకి అక్రమ చెల్లింపులు... జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఎందుకు? ఎంత అంటే!

 

త్వరలో వైసీపీ ఖాళీ.. టీడీపీ టచ్‌లోకి వైకాపా ఎమ్మెల్యేలు! జగన్‌వి పగటి కలలేనా..

 

కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం! కొత్త ఇళ్ల మంజూరుకు సర్వే ప్రారంభం! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

 

అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..

 

రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!

 

నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!

 

ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!

 

టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకాబెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..

 

ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో.. 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #Bharath #America #security #Indian #companies #todaynews #flashnews #latestupdate