తగ్గనున్న అమెరికా వీసా కష్టాలు.. తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్! ఏ కారణం చేతనైనా..

Header Banner

తగ్గనున్న అమెరికా వీసా కష్టాలు.. తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్! ఏ కారణం చేతనైనా..

  Sat Dec 21, 2024 07:00        U S A

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు అగ్రరాజ్యం మరో శుభవార్త చెప్పింది. వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి నిరీక్షించే పరిస్థితిని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం షెడ్యూలింగ్, రీషెడ్యూలింగ్లో కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. ఇకపై ఎలాంటి అదనపు ఫీజు లేకుండా ఒకసారి అపాయింట్మెంట్ (US visa appointment rules)ను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పించనుంది. జనవరి 1, 2025 అంటే నూతన సంవత్సరం నుంచి ఈ కొత్త రూల్స్ను అమలు చేయనున్నట్లు భారత్లోని అమెరికా దౌత్య కార్యాలయం వెల్లడించింది. “ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా వీసా (Visa) ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లు కల్పించాలి. వెయిటింగ్ సమయాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తున్నాం. జనవరి 1, 2025 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.

 

ఇంకా చదవండి: అమరావతికి ప్రపంచ బ్యాంకు భారీ నిధుల ఆమోదం! 1588 మిలియన్ డాలర్ల...!

 

నాన్ఇమ్మిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు మీకు నచ్చిన లొకేషన్లో ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ (Visa Appointment) కు తొలి షెడ్యూల్చేసుకోవచ్చు. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీరు రీషెడ్యూల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే.. ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఒకసారి షెడ్యూల్ను మార్చుకోవచ్చు.. ఆ తర్వాత ఒకవేళ మీరు అపాయింట్మెంట్ను మిస్ అయినా.. లేదా రెండోసారి రీషెడ్యూల్ చేసుకోవాలనుకున్నా.. కొత్త అపాయింట్మెంట్ కింద బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు మళ్లీ అప్లికేషన్ రుసుము చెల్లించాలి" అని ఎంబసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అపాయింట్మెంట్ ప్రక్రియను సులభతరం, వేగవంతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దౌత్యకార్యాలయం తెలిపింది. దరఖాస్తుదారులు షెడ్యూల్ చేసుకున్న సమయంలో ఇంటర్వ్యూలకు హాజరవ్వాలని సూచించింది. గత కొంతకాలంగా భారతీయులు అమెరికా వీసా అపాయింట్మెంట్ల కోసం నెలల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీ1/బీ2 విజిటర్ వీసా కోసం ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కావాలంటే ముంబయిలో 438 రోజులు ఎదురుచూడాలి. హైదరాబాద్లో అయితే ఈ సమయం 429రోజులుగా ఉంది. ఇక, స్టూడెంట్ వీసా అపాయింట్మెంట్కితే హైదరాబాద్లో 115 రోజులు వేచి చూడాలి. ఇదిలా ఉండగా.. ఇప్పటికే హెచ్-1బి వీసా నిబంధనలను అమెరికా సరళతరం చేసింది. ఎఫ్-1 విద్యార్థి వీసాలను సులభంగా హెచ్-1బి వీసాలుగా మార్చుకొనే వెసులుబాటునూ కల్పించింది. దీంతో గతంలోనే హెచ్-1బి వీసా కోసం ఆమోదం పొందిన వారి దరఖాస్తులిక వేగంగా ప్రాసెస్ అవుతాయి. ఈ నిబంధనలు జనవరి 17 నుంచి అమల్లోకి రానున్నాయి.

 

ఇంకా చదవండి: రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం వినూత్న నిర్ణ‌యం! డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు! 18 నుంచి 60 ఏళ్ల లోపు..

 

USA: H1B వీసా కొత్త రూల్స్ ఇవే.. ఉద్యోగస్తులు కచ్చితంగా అలా చేయాల్సిందే! మరో 20వేల వీసాలను జారీ!

 

నేడు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మంత్రులకు చంద్రబాబు ర్యాంకులు - పవన్, లోకేష్ స్థానాలు ఇవే! నాగబాబు చేరిక పై..

 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు! 21 అంశాలపై...!

 

జనసేన లీగల్ సెల్ లో కీలక నియామకం! పార్టీ జనరల్ కౌన్సిల్ గా ఎవరు అంటే!

 

జగన్ కు ఊహించని షాక్! మాజీ మంత్రితో పాటు పలువురు వైకాపా నేతలపై కేసు నమోదు.. కారణం ఇదే!

 

ఆర్జీవీకి అక్రమ చెల్లింపులు... జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఎందుకు? ఎంత అంటే!

 

త్వరలో వైసీపీ ఖాళీ.. టీడీపీ టచ్‌లోకి వైకాపా ఎమ్మెల్యేలు! జగన్‌వి పగటి కలలేనా..

 

కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం! కొత్త ఇళ్ల మంజూరుకు సర్వే ప్రారంభం! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

 

అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..

 

రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!

 

నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!

 

ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!

 

టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..

 

ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో.. 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Visa #Usa #Indian #VisaAppointment #Students