తస్మాత్ జాగ్రత్త! వాట్సాప్‌ యూజర్లపై పెగాసస్‌ నిఘా!

Header Banner

తస్మాత్ జాగ్రత్త! వాట్సాప్‌ యూజర్లపై పెగాసస్‌ నిఘా!

  Sun Dec 22, 2024 11:05        Technology

వాట్సాప్‌ వినియోగదారుల డివైజ్‌లలో అక్రమంగా పెగాసస్‌ స్పైవేర్‌ను జొప్పించిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ సంస్థపై మెటా దాఖలు చేసిన కేసులో అమెరికా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్‌ వినియోగదారుల డివైజ్‌ల హ్యాకింగ్‌కు ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌దే బాధ్యత అని స్పష్టం చేసింది. వాట్సాప్‌లోని బగ్‌ను ఉపయోగించుకొని అక్రమంగా స్పైవేర్‌ను జొప్పించిందని ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌పై మెటా సంస్థ 2019లో అమెరికా కోర్టును ఆశ్రయించింది.

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఫిల్లిస్‌ హమిల్టన్‌.. 1400 మంది వాట్సాప్‌ వినియోగదారుల డివైజ్‌లు లక్ష్యంగా మారడానికి పెగాసస్‌ స్పైవేర్‌ తయారుచేసిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌దే బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ సంస్థ సంబంధిత చట్టాల్లోని నిబంధనలను ఉల్లంఘించిందని పేర్కొన్నారు. కోర్ట్‌ వ్యాఖ్యల పట్ల మెటా సంస్థ హర్షం వ్యక్తం చేయగా, ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ స్పందించలేదు. 

 

ఇంకా చదవండిఎస్‌బీఐలో 13735 ఖాళీలు! హైదరాబాద్‌ స ర్కిల్‌లో 342 పోస్టులు!

 

భారత్‌లోనూ పెగాసస్‌ ప్రకంపనలు
పెగాసస్‌ స్పైవేర్‌ ఉదంతం భారత్‌లోని ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. 300 భారతీయ మొబైల్‌ నెంబర్లపై పెగాసస్‌ను వినియోగించారని 2021లో వార్తలు వచ్చాయి. ఇందులో అప్పటి ఇద్దరు కేంద్రమంత్రులు, ముగ్గురు ప్రతిపక్ష పార్టీల నేతలు, జర్నలిస్టులు, వ్యాపారులు ఉన్నట్టు ఆరోపణలు సంచలనం రేపాయి. అయితే, ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని అప్పటి ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ పార్లమెంటులో ప్రకటించారు. ఇప్పుడు అమెరికా కోర్టు తీర్పు నేపథ్యంలో మరోసారి దేశంలో పెగాసస్‌ స్పై వేర్‌ చర్చనీయాంశంగా మారింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!

  

కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరుఅప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!

 

తగ్గనున్న అమెరికా వీసా కష్టాలు.. తగ్గనున్న అపాయింట్మెంట్ వెయిట్ టైమ్! ఏ కారణం చేతనైనా..

 

రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!

 

ఏపీలో కొత్త బైపాస్‌ రోడ్డు నిర్మాణం - పూర్తయితే దూసుకుపోవడమే! ఎంపీ రిక్వెస్టుకు కేంద్రం ఓకే!

 

మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలోనే సీన్ రివర్స్.. కట్ చేస్తే! కుమార్తె పెళ్లిని రాజకీయం!

 

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం వినూత్న నిర్ణ‌యం! డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు! 18 నుంచి 60 ఏళ్ల లోపు.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Technology #Crimes #CyberCrimes #AndhraPradesh