ఈ ఫుడ్స్‌ వేర్వేరుగానే తినాలి... కలిపి తింటే డేంజరే! ఈ లక్షణాల ఆధారంగానే..

Header Banner

ఈ ఫుడ్స్‌ వేర్వేరుగానే తినాలి... కలిపి తింటే డేంజరే! ఈ లక్షణాల ఆధారంగానే..

  Sun Dec 22, 2024 11:18        Health

సాధారణంగా ఆహార పదార్థాలన్నింటిలో వివిధ రకాల ప్రొటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, వివిధ రకాల రసాయన సమ్మేళనాలు ఉంటాయి. వాటికంటూ ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అలాంటి ఆహార పదార్థాలను కలిపి తీసుకున్నప్పుడు.. రసాయన సమ్మేళనాల మధ్య ప్రతిచర్యలు జరిగే అవకాశం ఉంటుందని... దానితో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కడుపు నొప్పి, పొట్టలో ఉబ్బరం, అలర్జీలు, గ్యాస్‌, పేగుల్లో ఇబ్బంది వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. మన ఆయుర్వేదం కూడా ఈ లక్షణాల ఆధారంగానే కొన్ని రకాల పదార్థాలను కలిపి తీసుకోవద్దని సూచించిందని పేర్కొంటున్నారు.

 

ఇంకా చదవండి: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం రూ.50 వేలు!Don'tMiss

 

నెయ్యి- తేనె:- ఈ రెండు పదార్థాలను ఎప్పుడూ సమపాళ్లలో కలిపి తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. రెండొంతుల నెయ్యి, ఒకవంతు తేనెను కలిపి తీసుకోవచ్చని వివరిస్తున్నారు.


చేపలు, పాలు:- ఆయుర్వేద సూత్రాల ప్రకారం చేపలు, పాలను కలిపి తీసుకోకూడదు. అలా చేస్తే రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

హై ప్రొటీన్‌ ఫుడ్స్‌:- గుడ్లు, మాంసం వంటి అత్యధిక ప్రొటీన్లు ఉండే ఆహారాన్ని ఎప్పుడూ కలిపి తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.


పాలు-పళ్లు:- అరటి పళ్లు, నిమ్మ, ఆరెంజ్‌ వంటి సిట్రస్‌ పళ్లను పాలతో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పాలు-తులసి:- ఈ రెండింటినీ కలిపి తీసుకోవద్దని... ఒక వేళ తీసుకోవాల్సి వస్తే కనీసం 30 నిమిషాలు గ్యాప్‌ ఉండేలా చూసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


భోజనం-పళ్లు:- సాధారణ భోజనంలో పళ్లను కూడా కలిపి తీసుకోవద్దని, భోజనం చేసిన వెంటనే కూడా పళ్లు తినొద్దని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణశక్తిని దెబ్బతీస్తుందని పేర్కొంటున్నారు.

 

టమాటా-దోసకాయ:- ఈ రెండింటిని కలిపి తీసుకుంటే పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


హైప్రొటీన్‌ ఫుడ్‌-బంగాళదుంప:- బంగాళదుంపల్లో స్టార్చ్‌ ఎక్కువ. ప్రొటీన్లు జీర్ణంకావడానికి, స్టార్చ్‌ జీర్ణంకావడానికి వేర్వేరు ఎంజైములు అవసరమని... రెండింటినీ కలిపి తీసుకుంటే జీర్ణ శక్తి దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.

వెన్న ఉండే ఫుడ్‌-కూల్‌ డ్రింక్స్‌:- వెన్న శాతం అత్యధికంగా ఉండే ఆహారాన్ని, కార్బోనేటెడ్‌ కూల్‌ డ్రింక్‌ లను కలిపి తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. వెన్నలోని కొవ్వు పదార్థాలు, కూల్‌ డ్రింక్స్‌ లోని యాసిడ్లు కలసి పొట్టలో ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందని వివరిస్తున్నారు.


ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీలోకి కీలక నేత ఎంట్రీ! జగన్‌తో భేటీ - దీని కారణంగానే..

 

అమెరికా పౌరసత్వాల్లో పెరిగిన భారతీయులు! ఈ ఏడాది ఎంతమంది సిటిజెష్‌షిప్ పొందారో తెలిస్తే షాక్!

 

అల్లుఅర్జున్ కు ఊహించని షాక్! నేను చూస్తూ ఊరుకోను - సినీ ఇండస్ట్రీకి రేవంత్ హెచ్చరిక!

 

ఎస్‌బీఐలో 13735 ఖాళీలు! హైదరాబాద్‌ స ర్కిల్‌లో 342 పోస్టులు!

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!

 

నేడు (21/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #Andhra