జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్ కాదు! హైదరాబాద్‌లో ఈ ప్రాంతానికి భారీ డిమాండ్!

Header Banner

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్ కాదు! హైదరాబాద్‌లో ఈ ప్రాంతానికి భారీ డిమాండ్!

  Mon Dec 30, 2024 19:02        Real Estate

హైదరాబాద్ మహానగరం శివార్ల వరకు వేగంగా విస్తరిస్తోంది. అయినప్పటికీ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి సెంట్రల్ హైదరాబాద్‌కు మంచి డిమాండ్ ఉంది. అయితే, ఆ ప్రాంతాలతో పాటు మరో సెంట్రల్ హైదరాబాద్ ఏరియాకు ఫుల్ డిమాండ్ ఉంది. అక్కడ ఫ్లాట్ రూ.10 కోట్లు పలుకుతోంది. నవంబర్‌లో జరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లలో అత్యధిక ధర కలిగిన ఇళ్లు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. 

 

ఔటర్ రింగ్ రోడ్డు దాటి హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది. ఇల్లు, భూములు కొనుగోళ్లు భారీగా జరుగుతున్నాయి. ఓఆర్ఆర్ దాటి ఇళ్ల నిర్మాణాలూ జరుగుతూ కొత్త కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ సెంట్రల్ హైదరాబాద్‌కు ఉన్న డిమాండ్ ఏ మాత్రం చెక్కుచెదరలేదని చెప్పాలి. ఎందుకంటే నవంబర్ 2024లో జరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లలో అత్యధిక ఖరీదైన ఇళ్లు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఖరీదైన ఇండ్లు, ఫ్లాట్లు అనగానే ముందుగా గుర్తొచ్చేంది జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలు. 

 

అయితే, వాటిని వెనక్కి నెట్టి మరో ప్రాంతం అత్యధిక ధరలు పలుకుతోంది. అదే సోమాజిగూడ. ఇక్కడ విల్లాల ఖరీదు పదుల కోట్ల రూపాయలపైన పలుకుతున్నాయి. అపార్ట‌మెంట్లలో ఫ్లాట్ల ధరలు సైతం భారీగా ఉన్నాయి. సోమాజిగూడలో నవంబర్‌లో జరిగిన రిజిస్ట్రేషన్లలో ఓ ఫ్లాట్ ఏకంగా రూ. 10.22 కోట్లు పలికింది. ఇక బంజారాహిల్స్‌లో రెండు ఫ్లాట్లు రూ. 7.47 కోట్ల చొప్పున పలికాయి. ఇక జూబ్లీహిల్స్‌లో ఓ ఫ్లాట్ రూ. 7.04 కోట్ల విలువతో రిజిస్ట్రేషన్ జరిగింది. అత్యధిక ధర కలిగిన 5 ఫ్లాట్లు కూడా 3 వేలు అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉన్నాయి. 

 

ఇంకా చదవండిఅతి తక్కువ ధరలో 5జీ ఫోన్.. మతిపోగొట్టే ఫీచర్లతో విడుదల! ఆ వివరాలు మీకోసం.. Don't Miss! 

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

మరోవైపు.. విక్రయాలు బాగా ఉన్నప్పటికీ చదరపు అడుగు సగటు ధరల్లో పెరుగుదల నమోదవుతున్నట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్ తెలిపింది. హైదరాబాద్‌లో సగటు చదరపు అడుగు ధర రూ. 4,966గా ఉంది. గత ఏడాది 2023, నవంబర్‌తో పోలిస్తే ధరలు 10 శాతం పెరిగాయి. రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ వాటా 17 శాతంగా ఉంది. ఇక మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో సగటు చదరపు అడుగు ధర రూ. 3,563గా ఉంది. అనధికారికంగా ఈ ధర మరింత ఎక్కువే ఉంటుంది. మొత్తం నగర రిజిస్ట్రేషన్లలో మేడ్చల్ జిల్లా 42 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. ఇక రంగారెడ్డి జిల్లాలో సగటు చదరపు అడుగు ధర రూ. 4,213 గా ఉంది. రిజిస్ట్రేషన్లలో 41 శాతంతో రెండో స్థానంలో ఉంది. 

 

మొత్తం 3 జిల్లాల్లో కలిపి రిజిస్ట్రేషన్ల విలువ రూ. 50 లక్షల లోపు ఉన్న ఇళ్లు 58 సాతంగా ఉన్నాయి. రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల వాటా 28 శాతంగా ఉండగా.. రూ. 1 కోటి ఆ పైన ధర ఉండే ఇళ్ల రిజిస్ట్రేషన్లు 14 శాతంగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 2 శాతం మేర పెరిగింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో పెట్రేగిపోతున్న ట్రోలింగ్.. బొత్స కాళ్లు నేనెందుకు పట్టుకుంటాను? క్లారిటీ ఇచ్చిన మంత్రి!

 

అమెరికా వీసాల్లో రికార్డ్! ఈ ఏడాది కూడా 10 లక్షలు! అధిక శాతం భారతీయులే.. అందులో తెలుగువారు!

 

వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. తీవ్ర విషాదం.. రన్ వే మీదే కుప్పకూలిన విమానం! పెద్ద సంఖ్యలో మృతులు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త పథకం! వారికి పెట్రోల్డీజీల్‌పై 50% రాయితీ.. వెంటనే అప్లై చేసుకోండి?

 

చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!

 

నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

 

ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటేకొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #RealEstate #Hyderabad #HYDRA #Plots #Land