భారత్ లో ఓ గ్రామానికి అమెరికా మాజీ అధ్యక్షుడు పేరు! ఎందుకు పెట్టారంటే?
Mon Dec 30, 2024 19:15 India, U S Aఅమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి గ్రహీత జిమ్మీ కార్టర్.. 100 ఏళ్ల వయసులో ఈరోజు ఉదయం మరణించారు. దీంతో అమెరికాలోని రాజకీయ ప్రముఖులు అంతా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే భారతదేశంలోని ఓ గ్రామస్థులు కూడా జిమ్మీ మృతితో కన్నీరు పెడుతున్నారు. ఆయనతో తమకు ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాకుండా జిమ్మీ పేరునే తమ గ్రామానికి ఎందుకు పెట్టుకున్నారో కూడా వివరిస్తున్నారు. ఆ పూర్తి కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి గ్రహీత అయిన జిమ్మీ కార్టర్.. 100 ఏళ్ల వయసులో పలు అనారోగ్య సమస్యలతో ఈరోజు కన్నుమూశారు. దీంతో యూఎస్‌లోని ప్రముఖులు అంతా ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. అలాగే భారతదేశంలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు కూడా ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడికి.. ఇండియాలోని గ్రామస్థులుకు గల సంబంధం ఏంటి, వీళ్లు ఎందుకు ఆయన మృతి పట్ల కన్నీరు పెడుతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1976 అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ గెరాల్డ్ ఫోర్డ్‌ను ఓడించి అధ్యక్ష పదవిని దక్కించుకున్న జిమ్మీ కార్టర్. 1977 నుంచి 1981వ సంవత్సరం వరకు అమెరికా 39వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. మరోవైపు భారతదేశంలో 1975లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశానికి ఎమర్జెన్సీ విధించారు. 21 నెలల తర్వాత ఎమర్జెన్సీ ముగియడం.. ఆ తర్వాత జనతా పార్టీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. ఈక్రమంలోనే అప్పటి అమెరికా అధ్యక్షుడు అయిన జిమ్మీ కార్టర్ భారత దేశానికి వచ్చారు. అలా ఎమర్జెన్సీ తర్వాత ఇండియాకు వచ్చిన తొలి అమెరికా అధ్యక్షుడిగా రికార్డు సాధించారు.
ఇంకా చదవండి: అతి తక్కువ ధరలో 5జీ ఫోన్.. మతిపోగొట్టే ఫీచర్లతో విడుదల! ఆ వివరాలు మీకోసం.. Don't Miss!
ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
1978వ సంవత్సరం జనవరి 2వ తేదీన ఇండియాకు వచ్చిన జిమ్మీ కార్టర్.. ప్రజాస్వామం, స్వేచ్ఛపై ప్రసంగాలు చేశారు. ఆర్థికి, సామాజిక పురోగతి సాధించడానికి.. నిరంకుశ పాలనను నిర్ణయాత్మంగా ఖండించిన భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భారతదేశ ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని ప్రశంసించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఓటర్లు కల్గిన భారత్... తెలివిగా నాయకుడిని ఎన్నుకోవడంలో సఫలం అయిందంటూ వివరించారు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యమే గెలిచిందంటూ చెప్పుకొచ్చారు.
ఆ తర్వాతి రోజు జిమ్మీ కార్టర్, అప్పటి భారత ప్రధాని మెరార్జీ దేశాయ్‌లు.. రెండు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేసేందుకు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు నేతలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఢిల్లీకి సమీపంలోని దౌలత్‌పూర్ నసీరాబాద్ గ్రామాన్ని సందర్శించారు. ఆయన భార్య రోసలిన్‌తో అక్కడకు వెళ్లిన అప్పటి అమెరికా అధ్యక్షుడికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఇది చూసిన జిమ్మీ, ఆయన సతీమణి తెగ సంబుర పడిపోయారు.
అక్కడి ప్రజలతో కలిసి కాసేపు మాట్లాడారు కూడా. ఈ క్రమంలోనే ఆ గ్రామానికి జిమ్మీ పేరు పెట్టుకుంటామని అక్కడి ప్రజలు చెప్పారు. అలా ఆయన పేరులోని కార్టర్‌ను ఉపయోగించి.. తమ గ్రామం పేరును కార్టర్‌పురిగా మార్చుకున్నారు. ఇది చూసిన జిమ్మీ కార్టర్ చాలా మురిసిపోయారు. అప్పటి నుంచి అధికారికంగా కూడా నసీరాబాద్ గ్రామాన్ని కార్టర్‌పురిగానే పిలుచుకుంటున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. ప్రస్తుతం జిమ్మీ మృతి విషయం తెలుసుకున్న గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వల్లే తమ గ్రామం పేరు కార్టర్‌పురిగా మారిందని చెబుతూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో పెట్రేగిపోతున్న ట్రోలింగ్.. బొత్స కాళ్లు నేనెందుకు పట్టుకుంటాను? క్లారిటీ ఇచ్చిన మంత్రి!
అమెరికా వీసాల్లో రికార్డ్! ఈ ఏడాది కూడా 10 లక్షలు! అధిక శాతం భారతీయులే.. అందులో తెలుగువారు!
వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. తీవ్ర విషాదం.. రన్ వే మీదే కుప్పకూలిన విమానం! పెద్ద సంఖ్యలో మృతులు!
చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!
నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.