ముంబైలో భారీ వర్షం... ఆరు గంటల్లో 300 మి.మీ! 50 విమానాలు రద్దు!

Header Banner

ముంబైలో భారీ వర్షం... ఆరు గంటల్లో 300 మి.మీ! 50 విమానాలు రద్దు!

  Mon Jul 08, 2024 14:35        Environment, Travel

భారీ వర్షాలకు ముంబై అతలాకుతలం అయ్యింది. వర్షాల కారణంగా యాభైకి పైగా విమానాలు రద్దు అయ్యాయి. కొద్దిసేపు రన్వే కార్యకలాపాలను సస్పెండ్ చేయగా.. మొత్తం 27 విమానాలను దారి మళ్లించారు. ఆ విమానాలన్నీ హైదరాబాద్, అహ్మదాబాద్, ఇండోర్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ అయ్యాయి. అరైవల్స్క అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎయిర్ పోర్టు వర్గాలు వెల్లడించాయి. దారి మళ్లించిన విమానాలకు ఆలస్యమైతే అవసరమైన ఏర్పాట్లు చేయడంపైన దృష్టి పెడ్తామని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మరోవైపు, చాలా మంది ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే ఇరుక్కుపోయారు. ప్రయాణికులు బయల్దేరే ముందు విమాన సర్వీసు స్టేటస్ను చెక్ చేసుకోవాలని ముంబై విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ప్రతికూల వాతావరణం, భారీ వర్షాల కారణంగా ప్రయాణికులు తమ విమాన సర్వీసులకు సంబంధించిన అప్ డేట్ ను ఎయిర్ లైన్స్ ద్వారా తెలుసుకోవాలనిసూచించారు. ప్రయాణానికి కొద్దిసేపు ముందే ఎయిర్ పోర్టు చేరుకోవాలని కోరారు. ఈ విషయాన్ని సీఎస్ఎంఐఏ ఎయిర్ పోర్టు ఎక్స్ లో పోస్టు చేసింది.

 

ఇంకా చదవండి: వైసీపీతో అంటకాగిన ఐపీఎస్ అధికారుల పాట్లు! అధికారుల ప్రయత్నాలను చంద్రబాబు విఫలం!

 

ముంబైలో సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఉదయం 7 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షంకురిసింది. కేవలం ఆరు గంటల్లోనే 300 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబై, థానే, పాల్హర్, కొంకణ్ ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. థానే, పాల్టర్, రాయ్ గఢ్, రత్నగిరి, కొల్లాపూర్ సహాపలు ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి.

 

ఇవి కూడా చదవండి

నామినేటెడ్ పదవుల భర్తీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఆ పోస్టులు కోరిన డిప్యూటీ సీఎం!

 

ప్రధాని పదవికి అడుగు దూరంలో రాహుల్ గాంధీ! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

తిరుమలలో దళారుల ఆటకట్టు... 208 మంది అరెస్ట్! వదిలే ప్రసక్తేలేదు!

 

ఆ విషయంలో మాత్రం తెలంగాణకు మొదటి స్థానం! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

ఆ రోజు భూమికి అతి దగ్గరగా రానున్న ఆస్టరాయిడ్! నాసా ఏం చెప్తుంది అంటే!

 

యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ కు రాహుల్ గాంధీ బహిరంగ లేఖ! అందులో ఏముందంటే!

 

యూనీఫార్మ్ వేసుకోలేదని టీచర్ మందలించాడాని ఎం చేశాడో తెలుసా! అతన్ని కత్తితో...

                                                                                                                          

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 

 


   #AndhraPravasi #Environment #Rains #Storms #Nature #Mumbai #Floods