ఏపీలో రెండు రోజులు పాటు భారీ వర్షాలు! చలికాలంలోనూ వర్షాలతో వణికిస్తున్న బంగాళాఖాతం! ఆ జిల్లాల వారు జాగ్రత్త!

Header Banner

ఏపీలో రెండు రోజులు పాటు భారీ వర్షాలు! చలికాలంలోనూ వర్షాలతో వణికిస్తున్న బంగాళాఖాతం! ఆ జిల్లాల వారు జాగ్రత్త!

  Fri Nov 08, 2024 07:00        Environment

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలికాలం కొనసాగుతున్న సమయంలో కూడా వర్షాలు కురవడం ఏపీ వాసులకు ఆందోళన కలిగిస్తుంది. .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా నిత్యం వర్షాలు ఏపీవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో కురుస్తున్న విషయం తెలిసిందే. నైరుతి బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షాలు పడే ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తో పాటు నేడు నైరుతి బంగాళాఖాతంలో కూడా ప్రతి ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి ఇది 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తో పాటు యానంలోని దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని వెల్లడించింది.

 

ఇంకా చదవండి: నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు!

 

ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు, రేపు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ, ఉత్తరకోస్తాలలో ఈరోజు, రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రాయలసీమ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం లేదని పేర్కొంది. నేడు అల్లూరి సీతారామరాజు, కృష్ణ, నెల్లూరు, అన్నమయ్య, విశాఖపట్నం, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈరోజు బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏది ఏమైనా ఏపీలో వర్షాలు కురిసే ప్రాంతాలలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వాతావరణ శాఖ వెల్లడించింది.


ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

న్యూజిలాండ్ పర్యటనలో ప్రధానితో తెదేపా ఎమ్మెల్యేల భేటీ! ఏపీ అభివృద్ధి అంశాలపై చర్చలు!

 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత భేటీ! ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు!

 

టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక! 08-11-2024 న పాల్గొననున్న మంత్రులు, నాయకుల షెడ్యూల్!

 

వైసీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌! వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదు!

 

నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!

 

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే!

 

మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా..? అదిరిపోయే ఫీచర్లతో - అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటీ!

 

గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!

 

బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పెషల్‌ రీఛార్జ్‌ ఆఫర్‌! అన్‌లిమిటెడ్‌ కాల్స్‌... 600 జీబీ డేటా!

 

ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..

 

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Rain #AndhraPradesh #APSDMA #Weather