కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం మాఫియా బాగోతం గుట్టు రట్టు! స్టెల్లా షిప్లోని 5 కంపార్ట్మెంట్లలో...!

Header Banner

కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం మాఫియా బాగోతం గుట్టు రట్టు! స్టెల్లా షిప్లోని 5 కంపార్ట్మెంట్లలో...!

  Tue Dec 17, 2024 15:52        Politics

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టును పరిశీలించిన తర్వాత అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. స్టెల్లా నౌక ద్వారా పీడీఎస్ బియ్యం విదేశాలకు తరలిస్తున్నారన్న సమాచారంతో గత నెల 29న పవన్ కల్యాణ్, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా అధికారులతో కలిసి నౌకను పరిశీలించారు. ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో అధికారులు రంగంలోకి దిగారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. "నవంబరు 29న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్టెల్లా షిప్ను పరిశీలించిన తర్వాత ఐదు విభాగాల అధికారులు బృందంగా ఏర్పడి 12గంటల పాటు స్టెల్లా షిప్లోని 5 కంపార్ట్మెంట్లలో తనిఖీలు నిర్వహించి 12శాంపిల్స్ సేకరించారు.



ఇంకా చదవండిఏపీ ప్రజలకు భారీ శుభవార్త! వారి గుండెల్లో నిలిచిపోనున్న CBN! ఒక్కొక్కరికి... ఎప్పటి నుంచి అంటే?



షిప్లో దాదాపు 4వేల టన్నుల బియ్యం ఉన్నాయి. వాటిలో 1,320 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్టు నిర్ధరించాం. ఈ షిప్ ద్వారా సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ బియ్యం ఎగుమతి చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. వాళ్లు ఎక్కడి నుంచి బియ్యం తీసుకొచ్చారు, ఎక్కడ నిల్వ చేశారనేదానిపై దర్యాప్తు జరుగుతోంది. 1,320 టన్నుల బియ్యాన్ని వెంటనే షిప్ నుంచి అన్లోడ్ చేయించి సీజ్ చేస్తాం. కాకినాడ పోర్టులో ఇంకా లోడ్ చేయాల్సిన బియ్యం 12వేల టన్నులు ఉన్నాయి. వాటిలో ఎక్కడా పీడీఎస్ బియ్యం లేవని నిర్ధరించుకున్న తర్వాతే లోడింగ్కు అనుమతిస్తాం.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



కాకినాడ యాంకేజ్ పోర్టు, డీప్సీ వాటర్ పోర్టులో కూడా మరో చెకోపోస్టు ఏర్పాటు చేశాం. ఒక్క గ్రాము పీడీఎస్ బియ్యం కూడా దేశం దాటకుండా చర్యలు తీసుకుంటాం. షిప్ను ఎప్పుడు రిలీజ్ చేయాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. నిజాయతీగా బియ్యం వ్యాపారం చేసేవారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారులు, కూలీలు భయపడాల్సిన అవసరం లేదు" అని కాకినాడ కలెక్టర్ స్పష్టం చేశారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:



ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా నాలుగు లైన్ల రహదారి ప్రాజెక్టులకు మోక్షం! ఆ రూట్లలోనే..ఆ జిల్లా వారికి పండగ!

  

2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల! 21 ఐచ్ఛిక సెలవులు..

 

ఏపీలో కొత్త యూనివర్సిటీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఎక్కడ అంటే?

  

ఆర్జీవీ నోటి దూల తగ్గలా.. రేవంత్ రెడ్డి పై కారు కూతలు!

 

కావాలని కొట్టలేదు - ఐయామ్ సారీ! జర్నలిస్ట్ సంఘాలకి క్షమాపణలు.. వెంట విష్ణు కూడా..

 

రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!

     

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #ship #rice #shipping #export #todaynews #kakinada #flashnews #latestupdate