బియ్యం రవాణా చేసేందుకు అనుమతులు ఉన్నాయా? ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు!

Header Banner

బియ్యం రవాణా చేసేందుకు అనుమతులు ఉన్నాయా? ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు!

  Tue Dec 17, 2024 18:44        Politics

కాకినాడ పోర్టులోని ఎంవీ స్టెల్లా నౌక వ్యవహారం ఏపీ హైకోర్టుకు చేరింది. పారా బాయిల్డ్ రైస్ను కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌకలో లోడ్ చేసేందుకు అనుమతి ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బియ్యం రవాణా చేసేందుకు అనుమతులు ఉన్నాయా? అని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. నౌకలో బియ్యం లోడ్ చేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటని ధర్మాసనం అడిగింది. తమ బియ్యాన్ని నౌకలో లోడ్ చేయకుండా అడ్డుకుంటున్నారని చిత్ర, యాగ్రీ ఎక్స్పోర్ట్, పద్మశ్రీ రైస్ మిల్, సూర్యశ్రీ రైస్మిల్ యజమానులు భాస్కరరెడ్డి, గంగిరెడ్డి, విశ్వనాథరెడ్డిలు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానాన్ని కోరారు. ఏఏజీ అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:



ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా నాలుగు లైన్ల రహదారి ప్రాజెక్టులకు మోక్షం! ఆ రూట్లలోనే..ఆ జిల్లా వారికి పండగ!

  

2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల! 21 ఐచ్ఛిక సెలవులు..

 

ఏపీలో కొత్త యూనివర్సిటీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఎక్కడ అంటే?

  

ఆర్జీవీ నోటి దూల తగ్గలా.. రేవంత్ రెడ్డి పై కారు కూతలు!

 

కావాలని కొట్టలేదు - ఐయామ్ సారీ! జర్నలిస్ట్ సంఘాలకి క్షమాపణలు.. వెంట విష్ణు కూడా..

 

రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!

     

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #kakinada #port #riceexoport #paraboiled #highcourt #todaynews #flashnews #latestupdate