తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు! రహదారులు మూసివేత! విమాన రాకపోకలపై ప్రభావం!

Header Banner

తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు! రహదారులు మూసివేత! విమాన రాకపోకలపై ప్రభావం!

  Sat Nov 30, 2024 12:27        Environment

నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న వాయుగుండం శుక్రవారం తుఫానుగా మారింది. ఇది శనివారం సాయంత్రానికి పుదుచ్చేరి సమీపంలో కరైకల్‌ – మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వచే అవకాశం ఉందని హెచ్చరించింది.

 

ఈ ఫెంగల్‌ తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైతోపాటు సమీపంలోని చెంగల్‌పేట్‌, కాంచీపురం, తిరువళ్లూరు, మైలాడుతురై, నాగపట్నం, తిరువావూర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది.

 

జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షం, బలమైన గాలులకు విమాన కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది (flight ops hit). ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. చెన్నైకి రాకపోకలు సాగించే విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఇండిగో తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వాతావరణం అనుకూలించిన తర్వాత విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపింది.

 

ఇంకా చదవండితస్మా జాగ్రత్త: బాగా తిన్నా నీరసమా? ఈ లోపమే కారణం కావొచ్చు! కొన్ని లక్షణాల ఆధారంగా.. 

 

ఇంకా చదవండిడ‌యాబెటిస్ ఉన్న‌వారు బీట్‌రూట్ జ్యూస్‌ను తాగ‌వ‌చ్చా? తాగితే ఏమ‌వుతుంది?

 

తుఫాను నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఆదేశించింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లో అన్ని పాఠశాలలు, కళాశాలలను నేడు మూసివేయాలని ఆదేశించింది. స్పెషల్‌ క్లాసెస్‌ వంటివి తీసుకోవద్దని, పరీక్షలు కూడా రద్దు చేయాలని స్పష్టం చేసింది. భారీ వర్షం హెచ్చరికలతో ఇతర జిల్లాల్లోని కలెక్టర్లు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.

 

ఇక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజా రవాణా సేవలను సైతం ప్రభుత్వం నిలిపివేసింది. ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్‌, పాత మహాబలిపురం రోడ్‌ సహా కీలక రహదారులపై ప్రజా రవాణా సేవలను నిషేధించింది. తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఈ మార్గాలపై తుఫాను వల్ల కలిగే నష్టాలను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు చెన్నైలో భారీ వర్షం నేపథ్యంలో అండర్‌పాస్‌లను అధికారులు మూసివేశారు. ఇదిలా ఉండగా.. తుఫాను నేపథ్యంలో ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించాలని కంపెనీలను ప్రభుత్వం కోరారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళల అకౌంట్లలో రూ.1,500... ఇది మీరు గమనించారా? అలా అస్సలు చేయవద్దు - ప్రభుత్వం కీలక అప్డేట్!

 

కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా..వీటి ధర చూస్తే తక్కువ! మైలేజ్ చూస్తే ఎక్కువ.. ఆ బైక్స్ ఇవే!

 

మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!

 

షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారుఅసలు నిజం ఇదే!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Environment #Rains #Storms #Nature #AndhraPradesh #WeatherAlert #RainAlert