బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! ఏపీకి తీవ్ర హెచ్చరిక! హోం మంత్రి కీలక ఆదేశాలు!
Thu Dec 05, 2024 14:10 Environmentఆంధ్రప్రదేశ్ ను వర్షాలు వీడనంటున్నాయి. బంగాళాఖాతంలో ఒకదాని తర్వాత మరొకటి అల్పపీడనాలు ఏర్పడుతుండటంతో అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే ఫెంగల్ తుఫాను ప్రభావంతో అందినకాడిని పంటలను రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. భారీ వర్షాలున్నాయనే హెచ్చరికతో ప్రభుత్వం కూడా రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను రికార్డు స్థాయిలో పూర్తిచేసింది. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈనెల ఆరు, ఏడు తేదీల్లో ఏర్పడే ఆవర్తనం దక్షిణ దిశగా పయనించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
ఇంకా చదవండి: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటన! నామినేటెడ్ పోస్టుల మరో జాబితా సిద్దం - దక్కేది వీరికే!
బలహీనపడిన ఫెంగల్ ఆవర్తనంపై శుక్రవారం ఒక స్పష్టత వస్తుంది. ఫెంగల్ తుఫాను బలహీనపడి అల్పపడీనంగా మారి అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది. గురు, శుక్రవారాల్లో దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. రెండు మూడు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానలు కురవనున్నాయి. శుక్రవారం బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం శ్రీలంక దిశగా పయనిస్తుంది. ఇప్పటికే కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. రాయలసీమ జిల్లాల్లో మాత్రం నమోదవలేదు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
హోం మంత్రి అనిత సమీక్ష రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. గురువారం అన్నమయ్య, కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. అలాగే తిరుపతి, చిత్తూరు, నంద్యాల, కర్నూలు, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ శాఖ ల విభాగాధిపతులతో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించి తీసుకోవల్సిన చర్యలపై వారికి సూచనలు జారీచేశారు. సైరన్ అలారం సిస్టం పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం మంచి అవకాశం.. 8వ తేదీ నుంచి ప్రారంభం!Don'tMiss
కొడాలి నానికి వరుస షాక్ లు! తొమ్మిది మంది అరెస్ట్ - పరారీలో ప్రధాన అనుచరుడు..
మహిళలకు అప్డేట్.. ఉచిత బస్సు అమలుపై కీలక ప్రకటన! 1600 కొత్త బస్సులను కొనుగోలు!
కొడాలి నానికి వరుస షాక్ లు! తొమ్మిది మంది అరెస్ట్ - పరారీలో ప్రధాన అనుచరుడు..
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం! ఇక ఆ సమస్య లేనట్టే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Environment #Rains #Storms #Nature #AndhraPradesh #WeatherAlert #RainAlert
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.