సత్యం సుందరం' చూడగానే నాగార్జున ఫిదా! మనసును హత్తుకున్న చిత్రమని ట్వీట్!

Header Banner

సత్యం సుందరం' చూడగానే నాగార్జున ఫిదా! మనసును హత్తుకున్న చిత్రమని ట్వీట్!

  Mon Sep 30, 2024 12:46        Cinemas

కార్తి (Karthi), అరవింద స్వామి (Aravind Swami) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మెయ్యజగన్'. ఇదే చిత్రాన్ని 'సత్యం సుందరం' పేరుతో తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి కమర్షియల్ హంగులు, యాక్షన్ సీన్స్ లేకుండా ఫీల్గుడ్ మూవీగా ఇది రూపుదిద్దుకొంది. తాజాగా ఈ సినిమాని నటుడు నాగార్జున (Nagarjuna) వీక్షించారు. చిత్ర బృందాన్ని మెచ్చుకుంటూ ఎక్స్ (ట్విటర్)లో పోస్టు పెట్టారు. "డియర్ బ్రదర్ కార్తి.. నిన్న రాత్రి సత్యం సుందరం సినిమా చూశా. నువ్వు, అరవింద్ స్వామి అద్భుతంగా యాక్ట్ చేశారు. సినిమాలో నిన్ను చూస్తున్నంతసేపు నేను నవ్వుతూనే ఉన్నా. అదే నవ్వుతో ప్రశాంతంగా నిద్రపోయా. చిన్ననాటి జ్ఞాపకాలు, ముఖ్యంగా 'ఊపిరి' రోజులు గుర్తుకువచ్చాయి. మనసుని హత్తుకునే చిత్రాలను సినీప్రియులు, విమర్శకులు మెచ్చుకోవడం చూస్తుంటే ఆనందంగా ఉంది. టీమ్ అందరికీ నా అభినందనలు" అని ఆయన అభినందించారు. దీనిపై కార్తి స్పందించారు.


ఇంకా చదవండిఏపీ మహిళలకు అలర్ట్.. ఇలా చేస్తే, 3 ఉచిత సిలిండర్లు రావు! ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు!



"థాంక్యూ సో మచ్ అన్నయ్యా. మీ మాటలు మాకెంతో ఆనందాన్ని అందించాయి. మా సినిమా మీకు నచ్చినందుకు హ్యాపీగా ఉన్నాం. మంచి సినిమాపై మీరు చూపించే ఆదరణ మాలో ఎంతో స్ఫూర్తి నింపుతుంది" అని పేర్కొన్నారు. తమ సినిమాపై ప్రేక్షకులు చూపిస్తోన్న ఆదరణకు కార్తి ధన్యవాదాలు చెప్పారు. "ఈ కథ చదివినప్పుడు నా మనసు ప్రేమ, ఆనందంతో నిండింది. అదే అనుభూతిని మీకు కూడా ఇవ్వడం కోసం వెంటనే ఓకే చేశా. ఇదొక విభిన్నమైన జానర్కు సంబంధించిన కథ అయినప్పటికీ తప్పకుండా దీనిని మీకు అందించాలనుకున్నా. ఈరోజు మీరు మా సినిమాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాన్ని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది" అని పేర్కొన్నారు '96' చిత్రంతో ఓ సున్నితమైన ప్రేమకథను మనసుకు హత్తుకునేలా చూపించి సినీప్రియుల్ని మెప్పించారు దర్శకుడు సి. ప్రేమ్కుమార్. ఆరేళ్ల విరామం తర్వాత ఆయన తెరకెక్కించిన చిత్రమే 'సత్యం సుందరం'. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక దీనిని నిర్మించారు. గోవింద్ వసంత స్వరాలు అందించారు. తమిళంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో శనివారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. కార్తి యాక్టింగ్ చాలా బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితేఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!

 

పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!

 

జగన్ కు వరుసగా మరో షాక్! మీటింగ్ పెట్టి బ్రతిమిలాడుకుంటున్నా నో యూజ్! మరో ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గుడ్ బాయ్!

 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!

 

అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట!

 

నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారుఎవరు?

 

అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే!

 

విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్! పోస్టుల భర్తీ ప్రమాణాలు పెంచేలా చర్యలు!

 

పవన్ కల్యాణ్ నుంచి పవర్‍‌ఫుల్ వ్యాఖ్యలు... అండగా నిలబడాలి! సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే!

 

విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!

 

మాజీ ఎంపీ సీఐడీ కస్టడీలో చిత్రహింసలు కేసులో కీలక మలుపు! రిటైర్డ్ ఎస్పీ ముందస్తు బెయిల్ కు హైకోర్టు షాకింగ్ తీర్పు!

 

ఏపీలో వైన్ షాపులకు రెండుమూడు రోజుల్లో నోటిఫికేషన్! గవర్నర్ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #andhrapravasi #movie #sathyamsundaram #karthi #aravindswamy #nagarjuntweet #fids #supermovie #todaynews #flashnews #latestupdate