షూటింగ్ సమయంలో సెట్లో ప్రతిరోజూ ఏడ్చేదాన్ని! కెరీర్ ఆరంభం గురించి కీలక వ్యాఖ్యలు!

Header Banner

షూటింగ్ సమయంలో సెట్లో ప్రతిరోజూ ఏడ్చేదాన్ని! కెరీర్ ఆరంభం గురించి కీలక వ్యాఖ్యలు!

  Sat Oct 05, 2024 09:54        Cinemas

యానిమల్' సినిమాలో నటించి విశేష క్రేజ్ సొంతం చేసుకున్నారు త్రిప్తి డిమ్రీ (Tripti Dimri). తన అందచందాలతో యూత్ ఆడియన్స్ను కట్టిపడేశారు. ఇటీవల 'బ్యాడ్ న్యూజ్ అంటూ విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకువచ్చారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తనకు నటన గురించి ఏం తెలియదన్నారు.


ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10


‘చదువులో రాణించలేకపోయాను. దీంతో మోడలింగ్ వైపు రావాలని నిర్ణయించుకున్నా. ఈ విషయం నా తల్లిదండ్రులకు చెబితే వారు అంగీకరించలేదు. అయినా పట్టుదలతో అడుగుపెట్టాను. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఫొటోగ్రఫీ డైరెక్టర్, పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ అంటే ఏంటో తెలియదు. అప్పటికి నేను నటనలో కనీసం ఓనమాలు కూడా నేర్చుకోలేదు. విభిన్నంగా ప్రయత్నించాలనుకున్నా. తోటి నటీనటులతో కలిసి ప్రతీ సన్నివేశాన్ని చర్చించేదాన్ని. ఇండస్ట్రీకి వచ్చి సరైన నిర్ణయం తీసుకున్నానా అని ఎన్నోసార్లు ఆలోచించాను. 'లైలా మజ్ను' సమయంలో సెట్స్లో ప్రతిరోజూ ఏడ్చేదాన్ని. వాళ్లు చెప్పే భాష నాకు అర్థమయ్యేది కాదు. ఇంటికెళ్లి పాత్ర డైలాగులు ప్రాక్టీస్ చేసేదాన్ని' అంటూ కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్నారు.
ప్రస్తుతం త్రిప్తి మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. అనీస్ బజ్మీ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. విద్యాబాలన్, మాధురీదీక్షిత్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. దీనితో పాటు 'ధడక్ 2' లోనూ త్రిప్తి కనిపించనున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #movies #cinemas #triptidimri #heroine #shooting #acting #films #lilamajnu #todaynews #flashnews #latestupdate