అల్లు అర్జున్ విచారణ పూర్తి! దాదాపు మూడున్నర గంటల పాటు - రెండు ప్రశ్నలకు నో ఆన్సర్!

Header Banner

అల్లు అర్జున్ విచారణ పూర్తి! దాదాపు మూడున్నర గంటల పాటు - రెండు ప్రశ్నలకు నో ఆన్సర్!

  Tue Dec 24, 2024 19:38        Cinemas

సంధ్య తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పీఎస్లో హీరో అల్లు అర్జున్ విచారణ పూర్తి అయింది. విచారణ ముగిసిన అనంతరం ఎవరితో మాట్లాడకుండానే అల్లు అర్జున్ కారులో వెళ్లిపోయారు. అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్ తో కలిసి మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పీఎస్లో విచారణకు హాజరయ్యారు. వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన, అనంతరం జరిగిన పరిణామాలపై దాదాపు మూడున్నర గంటల పాటు ప్రశ్నించారు. అల్లు అర్జున్ను ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ల సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ప్రశ్నించారు. దాదాపు 50కి పైగా ప్రశ్నల్ని అల్లు అర్జున్ ముందు పోలీసులు ఉంచారు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి 10 నిమిషాల వీడియోను అల్లు అర్జున కు పోలీసులు చూపించారు. ఆ రోజు రాత్రి 9.30 గంటల నుంచి సంధ్య థియేటర్ బయటకు వెళ్లేవరకు ఏం జరిగిందనే దానిపై ప్రశ్నలు అడిగారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. రేవతి చనిపోయిన విషయం మీకు తెలుసు కదా అని పోలీసులు ప్రశ్నించారు.

 

ఇంకా చదవండి: ఏపీఎస్డీఎంఏ: రెండ్రోజుల పాటు వర్షాలు! బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో..

 

ఈ ప్రశ్నకు అల్లు అర్జున్ మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్లు తెలిసింది. తర్వాత రోజు వరకు తనకు తెలియదని మీడియాకు ఎందుకు చెప్పారని పోలీసులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కూడా అల్లు అర్జున్ సైలెంట్గానే ఉన్నారు. సంధ్య థియేటర్ ఘటనపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే యోచనలో పోలీసులు ఉన్నారు. డిసెంబర్ 4న సంధ్య థియేటర్లో పుష్ప-2 బెనిఫిట్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అనుమతి నిరాకరించినా ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి అల్లు అర్జున్ కారణమయ్యాడనే అభియోగంతో పోలీసులు కేసు నమోదు చేసిన ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల అయ్యారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో మలుపు! ఏ18గా మైత్రీ మూవీస్... నిందితుల జాబితా ఇదే!

 

రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? ఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు! కీలక ఆదేశాలు - అది ఏమిటంటే!

 

విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!

 

రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. నెలకు రూ.3 లక్షల 20 వేల జీతంతో జాబ్, అర్హతలు ఇవే! వారికి జర్మనీ దేశంలో..

 

నేడు (24/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!

 

బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు! ప్రత్యేక రక్షణ చట్టంపై...!

 

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

 

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!

 

డబ్బులు కడితే దొంగ దొర అవుతాడా? పదేపదే నీతులు వల్లించే వైసీపీ నేత! మాజీ మంత్రి పై మంత్రి ఫైర్!

 

2025 జనవరితో ఆ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు బంద్! బ్యాకప్ లేకుంటే మీ డాటా పోయినట్టే!

 

USAలో మ‌రో తెలుగు విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి! ఎవరు? ఎందుకు? దీని వెనుక ఎవరి హస్తం!

 

నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove