ఏంటి ఇది నిజమేనా! రిషి సునాక్ కు ఈ సారి ఓటమి తప్పదా! ఎంతో ఆసక్తికరంగా యూకే ఎన్నికలు!

Header Banner

ఏంటి ఇది నిజమేనా! రిషి సునాక్ కు ఈ సారి ఓటమి తప్పదా! ఎంతో ఆసక్తికరంగా యూకే ఎన్నికలు!

  Thu Jul 04, 2024 07:00        Europe

బ్రిటన్ పార్లమెంటరీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఆ దేశంలోని 650 స్థానాల్లో పోలింగ్ జరగనుండగా, ఈసారి ప్రధాన లేబర్, కన్జర్వేటివ్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న భారత సంతతి రిషి సునాక్ ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఒకటిన్నర దశాబ్ద కాలంగా ప్రతిపక్షంలో ఉండిపోయిన లేబర్ పార్టీకి అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జోరుగా జరుగుతోంది. కైర్ స్టార్మర్స్ ప్రధాని అవ్వొచ్చని ఒపీనియన్ పోల్స్లో వ్యక్తమవుతోంది. 14 ఏళ్లుగా అధికారం కొనసాగిస్తున్న కన్జర్వేటివ్ పార్టీపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా లేబర్ పార్టీ మార్పు నినాదంతో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కన్జర్వేటివ్ పార్టీ పాలనలో ఆర్థికవ్యవస్థ నెమ్మదించడం, కుంభకోణాలు, ద్రవ్యోల్బణ ప్రభావం వంటి అంశాల కారణంగా లేబర్ పార్టీ అధికారంలో కొనసాగడం కష్టమనే అంచనాలున్నాయి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

650 పార్లమెంటరీ సీట్లలో అధికారం చేపట్టేందుకు ఒక పార్టీ కనీసం 326 సీట్లను గెలవాల్సి ఉంటుంది. ఆ పార్టీ కీలకనేత ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. గురువారం ఓటింగ్ పూర్తయిన తర్వాత రాత్రి 10 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఓట్ల లెక్కింపు కూడా ఆ వెంటనే ప్రారంభమవుతోంది. మొదటి ఫలితాలు కొన్ని గంటల్లోనే వస్తాయి. చాలా సందర్భాల్లో ఫలితాలు రాత్రిపూటే ప్రకటిస్తారు. మరుసటిరోజు ఉదయం 5-7 గంటల మధ్య గెలుపు ఎవరిదనేది ఖాయమవుతుంది. మొదటి ఫలితం తేలిన తర్వాత పాలక పక్షం ఓడిపోతే ప్రధానమంత్రి తన రాజీనామాను శుక్రవారం రాజుకు అందజేస్తారు. ఆ తర్వాత గెలిచిన పార్టీ నేత రాజును కలుస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు అభ్యర్తిస్తారు. కొత్త ప్రధాని సీనియర్ పదవులతో మొదలుకొని మంత్రులను నియమిస్తారు.

 

ఇంకా చదవండి: టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూడేళ్ల క్రితం నాటి దాడి కేసులో నిందితుల అరెస్టు! వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ప్రధాన సూత్రదారి!

 

మరోవైపు, ఈసారి యూకే ఎన్నికలను హిందూ ఓటర్లు ఎక్కువ ప్రభావితం చేయనున్నారు. ఇంగ్లాండ్లోనే మూడో అతిపెద్ద మత సమూహంగా ఉన్న బ్రిటీష్ హిందువులు ఈ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంతగా తమ రాజకీయ స్వరాన్ని వినిపించనున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఇరు పార్టీల రాజకీయ నాయకులు ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. జూన్ 8న యూకేలోని 29 హిందూ సంఘాలు 'ది హిందూ మేనిఫెస్టో- 2024' పేరిట తమ ఏడు కీలక డిమాండ్లను విడుదల చేశారు. బ్రిటీష్ హిందువులు తమ కమ్యూనిటీ కోసం డిమాండ్లను ఎన్నికల ముందుకు తీసుకురావడం ఇదే మొదటిసారి. 2021 జనాభా లెక్కల ప్రకారం బ్రిటన్లో సుమారు 10 లక్షల మంది హిందువులు ఉన్నట్టు అంచనా. వారిలో ఓటర్లు కూడా గణనీయంగా ఉండే అవకాశం ఉంది. ఇక, వారి ఓట్లను పొందడానికి ప్రధాన పార్టీ అభ్యర్థులు హిందూ దేవాలయాలను సందర్శిస్తున్నారు. లండన్లోని శ్రీ స్వామినారాయణ్ ఆలయాన్ని ఈ ఆదివారం రిషి సునాక్ దంపతులు సందర్శించారు. అలాగే, లేబర్ పార్టీ నేత కైర్ స్టార్మర్స్ కూడా కింగ్స్బరీలోని మరో స్వామినారాయణ్ ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు.

 

ఇవి కూడా చదవండి

సీఎం చంద్రబాబు ప్రజా వేదిక కార్యక్రమం వాయిదా! కారణం ఆదేనా!

 

నెలలో మూడు రోజులు కేటాయిస్తాను... ఉప్పాడలో క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం! ఏంటో చూసేయండి!

 

రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన చంద్రబాబు! ఆ పదకం మళ్ళీ అమలు! 

 

ఏపీలో నిరుద్యోగులకు బిగ్ అలర్ట్! గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా!

 

పార్లమెంటు కొత్త కేబినెట్ కమిటీలు ఏర్పాటు! తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పెద్దపీట! 

 

అమరావతిలో జగన్ రెడ్డి విధ్వంసాన్ని వివరించిన చంద్రబాబు! శ్వేత పత్రం విడుదల!

 

నీట్ పరీక్షపై హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు! ఆ పని చెయ్యండని సలహా!

 

అమరావతిలో జగన్ సర్కార్ చేసిన ఘనకార్యాలు అన్నీ ప్రజల ముందుకు! రాజధానిపై శ్వేతపత్రం విడుదల!

 

అక్రమార్కులతో చేతులుకలిపి ప్రజలను దోచుకుంటున్న దేవాదాయశాఖ అధికారులు! సస్పెన్షన్ కు గురైన పలువురు! 

 

శ్రీవారి అన్నప్రసాదం తయారీపై టీటీడీ కీలక నిర్ణయం! భక్తుల ఫిర్యాదులు పరిగణనలోకి! 

 

ఏపీకి పారిశ్రామిక రాయితీలు! రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు! రోడ్లు, పోలవరానికి ప్రత్యేక నిధులు! నేడే చంద్రబాబు ఢిల్లీ టూర్! 

 

సీబీఐకి హై కోర్టు నోటీసులు! కేజ్రీవాల్ అరెస్ట్ పై విచారణ! 

 

కర్ణాటక నుంచి కటకటాల వెనక్కి వెళ్ళడానికి వచ్చిన జగన్! ఈ కామెంట్స్ చూస్తే రక్త కన్నీరే! ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ఈయన పరిస్థితి ఏంటో!

                                                                                 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group  


   #AndhraPravasi #Europe #UK #UnitedKingdom #UKNews #UKElections #UKUpdates