యూకే: ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీకి ఘోర ఓటమి! లేబర్ పార్టీదే విజయం! ఎగ్జిట్ పోల్స్ అంచనా!

Header Banner

యూకే: ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీకి ఘోర ఓటమి! లేబర్ పార్టీదే విజయం! ఎగ్జిట్ పోల్స్ అంచనా!

  Fri Jul 05, 2024 08:48        Europe

గురువారం జరిగిన యూకే పార్లమెంటరీ ఎన్నికలు-2024లో ప్రధాని రిషి సునాక్ ప్రాతినిధ్యం వహిస్తున్న కన్సర్వేటివ్ పార్టీకి ఘోర ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. లేబర్ పార్టీ ఏకపక్ష విజయం సాధించబోతోందని, ఆ పార్టీ నేత కైర్ స్టార్మర్ తదుపరి బ్రిటన్ ప్రధాని కానున్నారని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి. కాగా గురువారం రాత్రి 10 గంటల సమయంలో యూకే పార్లమెంట్ పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. పార్లమెంట్‌లో మొత్తం 650 సీట్లు ఉండగా లేబర్ పార్టీ 410 స్థానాలను గెలుచుకోబోతోందని అంచనా వేశాయి. దీంతో 14 ఏళ్లుగా కొనసాగుతున్న కన్సర్వేటివ్ పార్టీ ప్రభుత్వానికి ముగింపు పడబోతోందని పేర్కొన్నాయి. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇక ఈ ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీకి 131 స్థానాలు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాగా గత ఎన్నికల్లో ఆ పార్టీ 346 సీట్లు గెలిచింది. 2016 నుంచి ఇప్పటివరకు కన్సర్వేటివ్ పార్టీలో ఐదుగురు వేర్వేరు ప్రధాన మంత్రులు మారారు. జీవన వ్యయాల పెరుగుదల, కొన్నేళ్లుగా కొనసాగుతున్న అస్థిరత, పార్టీలో అంతర్గత పోరు కన్జర్వేటివ్‌ల ఓటమికి కారణాలు కాబోతున్నాయని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి. కాగా యూకే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అధికారిక ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈ మేరకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది.

 

ఇవి కూడా చదవండి

బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీలు! రాత్రికి రాత్రే ఆరుగురు జంప్!

 

అమరావతి వాసులకు కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్! ఔటర్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్!

 

ఆంధ్రప్రదేశ్‌లో 'అధికార మార్పిడి'పై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు! ఏంటో ఒక లుక్ వేయండి! 

 

ఇలాంటి దొంగతనం ఎప్పుడూ చూసుండరు! ఇంట్లో అన్నీ దోచేసి... ఒక లేఖ రాశాడు! అందులో ఏముందంటే!

 

మేనమామగా ఉంటానంటూ జగన్ చిన్నారుల నోళ్లుకొట్టారు! మంత్రి లోకేశ్ ఫైర్! 

 

ఆ విషయం తెలిసి కూడా జగన్ నెల్లూరు బయల్దేరారంటే అర్థం ఏమిటి? హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు!

 

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 16 మంది టీచర్లు అమెరికాకు! NRI మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా ఘనంగా సత్కారం! CM చంద్రబాబు విజనరీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశ కల్పన దిశగా! 

 

బస్తాలకొద్దీ గత ప్రభుత్వ ఫైళ్ల దహనం! ఇద్దరు నిందితులు అరెస్ట్! వెలుగులోకి కీలక నేత పేరు!

 

ఏంటి ఇది నిజమేనా! రిషి సునాక్ కు ఈ సారి ఓటమి తప్పదా! ఎంతో ఆసక్తికరంగా యూకే ఎన్నికలు!

 

సీఎం చంద్రబాబు ప్రజా వేదిక కార్యక్రమం వాయిదా! కారణం ఆదేనా!

 

నెలలో మూడు రోజులు కేటాయిస్తాను... ఉప్పాడలో క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం! ఏంటో చూసేయండి!

   

పార్లమెంటు కొత్త కేబినెట్ కమిటీలు ఏర్పాటు! తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పెద్దపీట! 

    

అక్రమార్కులతో చేతులుకలిపి ప్రజలను దోచుకుంటున్న దేవాదాయశాఖ అధికారులు! సస్పెన్షన్ కు గురైన పలువురు! 

                                                                                     

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Europe #UK #UnitedKingdom #UKNews #UKElections #UKUpdates