ఏపీలో రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక! రైల్వే ట్రాక్‌, ఇతర నిర్వహణ పనులు కారణంగా! ఈ రైళ్లన్ని ఒకేసారి రద్దు కావడంతో రైల్వే స్టేషన్‌లు!

Header Banner

ఏపీలో రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక! రైల్వే ట్రాక్‌, ఇతర నిర్వహణ పనులు కారణంగా! ఈ రైళ్లన్ని ఒకేసారి రద్దు కావడంతో రైల్వే స్టేషన్‌లు!

  Wed May 29, 2024 08:39        India, Travel

ఏపీలో రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక.. డెమో రైళ్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. రైల్వే ట్రాక్‌, ఇతర నిర్వహణ పనులు కారణంగా పది రోజులుగా డెమో రైళ్లు రద్దు చేశారు.. ఆ పనులు పూర్తికావడంతో ఈ రైళ్లు మళ్లీ పట్టాలెక్కాయి. రాజమహేంద్రవరం, నిడదవోలు, విజయవాడ, గుంటూరు నుంచి నడిచే అన్ని రైళ్లు ప్రారంభమయ్యాయి. ఈ రైళ్లు గతంలో షెడ్యూల్‌ ప్రకారం నడుస్తాయని అధికారులు తెలిపారు. అటు నరసాపురం, భీమవరం నుంచి నడిచే డెమో రైళ్లు కూడా ప్రారంభమయ్యాయి.. షెడ్యూల్ ప్రకారమే నడుస్తాయి.‌ మరోవైపు గుంటూరు వెళ్లే పాస్ట్‌ ప్యాసింజర్‌ మాత్రం ప్రారంభంకాలేదు. ఈ నెల 31 నుంచి ఈ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కనున్నట్లు తెలిపారు.

 

ఇంకా చదవండి: ఢిల్లీ-వారణాసి ఇండిగో విమానంలో ఘటన! టాయ్ లెట్ లో ‘30 నిమిషాల్లో బాంబ్ బ్లాస్ట్’ చీటీ!

 

నరసాపురం నుంచి ఉదయం 9.45కి విజయవాడ, అలాగే మధ్యాహ్నం 2.45కి గుంటూరు, మధ్యాహ్నం 3.05కి విజయవాడ, రాత్రి 8.10కి నిడదవోలు, రాత్రి 11.10కి భీమవరం వెళ్లే డెమా రైళ్లు కూడా షెడ్యూల్ మేరకు నడవనున్నాయి. ఈ డెమో రైళ్లు పది రోజులుగా రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ రైళ్లన్ని ఒకేసారి రద్దు కావడంతో రైల్వే స్టేషన్‌లు వెలవెలబోయాయి. కొందరు ప్రయాణికులు గుంటూరు పాస్ట్‌ ప్యాసింజర్‌ రైలు కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. ఈ రైలు రద్దు చేయడంతో ఉదయం సమయంలో గుంటూరు, విజయవాడ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

 

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

 

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

 

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #India #Train #Notes #Guntur #Vijayawada #Railwaystation