ట్రాఫిక్ కష్టాలకు చెక్.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్, ఇక దూసుకెళ్లిపోవచ్చు!

Header Banner

ట్రాఫిక్ కష్టాలకు చెక్.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్, ఇక దూసుకెళ్లిపోవచ్చు!

  Tue Dec 03, 2024 09:43        Politics, Travel

హైదరాబాద్ లో మరో అతిపెద్ద ఫ్లైఓవర్ కొద్దిరోజుల్లో అందుబాటులోకి రానుంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్(ఎస్ఆర్డీపీ)లో భాగంగా ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు చేపట్టిన ఫ్లైఓవర్ పనులు ఎట్టకేలకు చివరి దశకు చేరుకున్నాయి. డిసెంబరె మొదటి వారంలో సీఎం రేవంత్రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. ఫ్లైఓవర్పనులు 2021లో ప్రారంభం కాగా, గతేడాది నుంచి స్పీడప్చశారు. అంచనా వ్యయం రూ.636.80 కోట్లు కాగా, పూర్తయ్యే సరికి రూ.736 కోట్లకు చేరింది. ప్రత్యేక రాష్ట్రంలో పొడవైన ఫ్లైఓవర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిటీలో నిర్మించిన అతిపెద్ద ఫ్లైఓవర్ ఇదే కానున్నది.

 

ఇంకా చదవండి: నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఉమ్మడి రాష్ట్రంలో పీవీ నరసింహరావు ఎక్స్ప్రెస్ వే 2009లో అందుబాటులోకి వచ్చింది. ఇది11.66 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లేన్లతో నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ దేశంలోనే నెంబర్ స్థానాన్ని సొంతం చేసుకుంది. అప్పట్లో ఎయిర్ పోర్టుకు వెళ్లేవారికి ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. నేటికీ ఫోర్ వీలర్స్ కు మాత్రమే అనుమతి ఉంది. హెవీ వెహికల్స్, టూవీలర్స్, ఆటోలకు పర్మిషన్లేదు. ఆ తర్వాత కొత్తగూడ ఫ్లైఓవర్ ను 3 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లేన్లతో నిర్మించారు. అతిత్వరలో ఆరాంఘర్ ఫ్లైఓవర్ 4.08 కిలోమీటర్ల పొడవుతో ఆరు లేన్లలో అందుబాటులోకి రానుంది. ఇది నగరంలో అతిపెద్ద రెండో ఫ్లెఓవర్ స్థానాన్ని దక్కించుకోనుంది. ఫ్లైఓవర్ పనులను హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తో కలిసి బల్దియా కమిషనర్ ఇలంబరితి మంగళవారం పరిశీలించారు.

 

ఇంకా చదవండి: ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

నాలుగు రోజుల్లో అన్ని పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సర్వీస్ రోడ్డు నిర్మాణానికి 17 ఆస్తులు సేకరించాలని, ప్రస్తుతం పని జరిగేందుకు 5 ఆస్తులు వెంటనే సేకరిస్తే సర్వీస్ రోడ్డు పనులు ప్రారంభించే అవకాశం ఉంటుందని చీఫ్ ఇంజనీర్ దేవానంద్ కమిషనర్ కు వివరించారు. నష్టపరిహారం చెల్లించేందుకు ప్రతిపాదనలను పంపిస్తే, మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు 24 మీటర్ల వెడల్పు, 4.08 కిలోమీటర్ల పొడవు, ఆరు లేన్లతో నిర్మించారు. అందుబాటులోకి వస్తే జూపార్క్ నుంచి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్పోర్టు, మహబూబ్నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు వెళ్లేవారికి ట్రాఫిక్ఇబ్బందులు తప్పుతాయి. తాడ్బన్, దానమ్మ హట్స్, హసన్ నగర్ జంక్షన్లలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగాల్సిన పనిలేదు. జూపార్కు వచ్చే సందర్శకులు, పాతబస్తీ వైపు వెళ్లే వాహనాలకు ప్రయాణం ఈజీ అవుతుంది.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

సంక్షేమ పథకాలపై మార్పులు, చేర్పులు సీఎం సంచలన నిర్ణయం! ఇకపై ప్రతి ఒక్కరికీ ఆ అవకాశం - ఈ కార్యక్రమం ద్వారా..

 

నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్! విశాఖ వస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. నెక్ట్స్ ఎవరు?

 

ఏమిటి.. పరగడపున ఈ పళ్లు తింటే! రోజువారీ ఆహారంలో - సమస్యలు తెచ్చుకున్నట్టేనట!

 

విజయవాడ ట్రాఫిక్‌ సమస్యలకు టెక్నాలజీ తోడు! డ్రోన్లు, ఎస్ఈడీ బోర్డులతో పోలీసుల ముందడుగు!

 

టీడీపీ కార్యకర్త ఆత్మహత్యపై లోకేశ్ భావోద్వేగ వ్యాఖ్యలు! కష్టాలను చెప్పుకోకపోవడం నా మనసును కలిచివేసింది!

 

బూడిద తరలింపు వివాదం.. ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్! ఎందుకు అంటే!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. భారీగా తగ్గిన మద్యం ధరలు! ఆ వివరాలు మీ కోసం..

 

2/12 TO 14/12 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Hyderabad #NewRoad #Highway #Politics