అరకు వెళ్ళే పర్యాటకులకు గుడ్ న్యూస్! రైల్వే శాఖ కీలక నిర్ణయం!

Header Banner

అరకు వెళ్ళే పర్యాటకులకు గుడ్ న్యూస్! రైల్వే శాఖ కీలక నిర్ణయం!

  Tue Dec 24, 2024 11:44        Travel

విశాఖపట్నం టూరిజంకు వచ్చిన పర్యాటకులు తప్పక సందర్శించే ప్రాంతం 'అరకు లోయ'. ఇక ఈ అరకు అందాల గురించి వర్ణించాలంటే.. అందమైన పర్వతాలు, పాలధారను తలపించే జలపాతాలు, కాఫీ తోటలు, మంచు కొండలు, జల సవ్వళ్ళు ఇలా ఎన్నో సుందరమైన దృశ్యాలు అరకులో మనం చూడవచ్చు. ఈ సుందర మనోహర దృశ్యాలు చూడడానికి పర్యాటకులు అరకు ప్రదేశానికి వెళ్తుంటారు. అంతేకాదు ఈ అందమైన దృశ్యాలు తమ కెమెరాల్లో బంధించుతారు. ప్రకృతి సోయగాల నడుమ సెల్ఫీలు దిగుతూ ఆనందంలో తేలియాడుతారు. ఈ నేపథ్యంలో తాజాగా అరకు పర్యాటకులకు తూర్పు కోస్తా రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.

 

ఇంకా చదవండినిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం రూ.50 వేలు!Don'tMiss 

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అరకు పర్యాటకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తూర్పు కోస్తా రైల్వే విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 11.45 గంటలకు అరకు చేరుకోనున్నట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో అదే రోజుల్లో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సాయంత్రం 6 గంటలకు విశాఖ చేరుకోనున్నట్లు తెలిపారు. ఒక సెకెండ్ ఏసీ, ఒక థర్డ్ ఏసీ, 10 స్లీపర్ క్లాస్, 4 సాధారణ రెండో తరగతి, 2 జనరల్ కమ్ లగేజీ బోగీలతో ఈ ట్రైన్ సింహాచలం, కొత్తవలస, ఎస్.కోట, బొర్రా గుహలు మీదుగా రాకపోకలు సాగించనున్నట్లు తెలియజేశారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

 

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!

 

డబ్బులు కడితే దొంగ దొర అవుతాడా? పదేపదే నీతులు వల్లించే వైసీపీ నేత! మాజీ మంత్రి పై మంత్రి ఫైర్!

 

2025 జనవరితో ఆ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు బంద్! బ్యాకప్ లేకుంటే మీ డాటా పోయినట్టే!

 

USAలో మ‌రో తెలుగు విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి! ఎవరు? ఎందుకు? దీని వెనుక ఎవరి హస్తం!

 

నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Travel #Araku #Vizag #BorraCaves