మహిళలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ! శిక్షణ శిబిరం ఏర్పాటు!

Header Banner

మహిళలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ! శిక్షణ శిబిరం ఏర్పాటు!

  Sun Jun 02, 2024 10:52        Associations

శ్రీశైలం: మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నంధ్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు సున్నిపెంటలో మహిళలకు కుట్టుమిషన్లను పంపిణీ చేసింది. మహిళలు మరొకరి మీద ఆధారపడకుండా వాళ్లు స్వయం ఉపాధి పొందేందుకు కావాల్సిన సహకారాన్ని నాట్స్ అందిస్తుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి అన్నారు. సున్నిపెంట గ్రామంలో పదిమంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడంతో పాటు శిక్షణ శిబిరాన్ని బాపు నూతి ప్రారంభించారు. కుటుంబంలో మహిళ పాత్ర చాలా కీలకమని అలాంటి మహిళ ఏదో ఒక స్వయం ఉపాధి సాధించడం ద్వారా ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయని తెలిపారు. ఎక్కడో అమెరికాలో ఉన్న బాపయ్య చౌదరి లాంటి వారు మానవత దృక్పథంతో తమ సేవా కార్యక్రమాలను నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న మారుమూల గ్రామమైన సున్నిపెంటలో చేయటం అభినందనీయమని స్థానికులు కొనియాడారు. భవిష్యత్తులో నాట్స్ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేసి తెలుగు రాష్ట్రాల్లో తమ సేవలు విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

WhatsApp Image 2024-06-02 at 10.51.09.jpeg

 

ఇవి కూడా చదవండి: 

ఆలస్యమైన విమానం... దానికి పరిహారం! 29 వేల వోచర్! ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం! 

 

ప్రపంచంలోనే అత్యంత అల్లకల్లోల వాతావరణం (టర్బ్యులెన్స్) ఉండే విమాన మార్గాలు! ఈ 5 బాగా డేంజరస్! సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రమాదం అందుకే! 

 

సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న సాక్షి! ఆ ఛానల్ లో మాత్రమే ఇలా! 

 

ప్రపచవ్యాప్తంగా అత్యుత్తమ బడ్జెట్ ఎయిర్ లైన్స్! ఇండియాకు సంబంధించి! 

 

భారత్ నుండి యూఏఈ వెళ్తున్నారా! అయితే ఇది మీ కోసమే! సేమ్ ఎయిర్ లైన్లో రిటర్న్ టికెట్ తప్పదు! 

 

ఢిల్లీ-వారణాసి విమానంలో బాంబు బెదిరింపుపై సమీక్ష! ఆరుగురు సిబ్బందిని తొలగించిన ఇండిగో! కారణం తెలిస్తే అవాక్కవుతారు! 

 

భావోద్వేగంతో - ABV అధర్మాన్ని ఎదుర్కోవటమే వృత్తిగా! చట్టాన్ని కాపాడేందుకే కృషి! లక్షల మంది అభిమానంతో, పూర్తి సంతృప్తితో...

 

మాస్కోకు భారీగా పెరుగుతున్న భారతీయ పర్యాటకులు! మరిన్ని సౌకర్యాలను కల్పిస్తున్న రష్యా ప్రభుత్వం! గత సంవత్సరంతో పోలిస్తే! 

 

ఆ రెండు విషయాల్లో ఎమిరేట్స్ ఒకటవ స్థానంలో! ప్రీమియం ఎకానమీ కేక! ఓవర్ ఆల్ లో మాత్రం నెంబర్ 1 అదే! 

 

ఎయిర్‌లైన్స్ రేటింగ్స్ ర్యాంకింగ్స్‌లో ఎయిర్ న్యూజిలాండ్ అగ్రస్థానం! టాప్ 5 స్థానాలలో ఏవంటే? 

         

తెలుగు తమ్ముడికి 8 కోట్లు - దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం డ్రాలో గెలుపు! మరో ఇద్దరు భారతీయులకు కారు, బైకు! అదృష్టం ఉంటే అలా ఉండాలి 

   

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Associations #TeluguMigrants #NATS #Nandyala #Srisailam