తస్మాత్ జాగ్రత్త.. ఈ నంబర్ల నుంచి ఫోన్లు వస్తే లిఫ్ట్ చేయకండి! వాటి పట్ల అప్రమత్తంగా...

Header Banner

తస్మాత్ జాగ్రత్త.. ఈ నంబర్ల నుంచి ఫోన్లు వస్తే లిఫ్ట్ చేయకండి! వాటి పట్ల అప్రమత్తంగా...

  Wed Dec 04, 2024 13:03        Technology

అమాయకులను బురిడీ కొట్టించడమే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. ముఖ్యంగా సెల్‌ఫోన్లకు మెసేజులు పంపించడం, కాల్స్ చేయడం ద్వారా అమాయకుల బ్యాంకు ఖాతాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను కాజేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ తరహాలోనే ఇటీవల కొన్ని విదేశీ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తం చేశారు.

 

ఇంకా చదవండి:   పర్యాటకులకు చేదు అనుభవం! లంబసింగి వ్యూ పాయింట్ తాత్కాలిక మూసివేత!


ఆ నంబర్లు ఇవే..
అపరిచితుల నుంచి +56322553736, +37052529259, +94777 455913, +37127913091, +255901130460 నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయవద్దని పోలీసులు సూచించారు. ముఖ్యంగా +381 (సెర్బియా), +563 (లోవా), +370 (లిథువేనియా), +371 (లాత్వియా), +375 (బెలారస్‌), +255 (టాంజానియా) వంటి కోడ్‌ నంబర్లతో ఫోన్ రింగ్ అవుతోందని, లిఫ్ట్ చేశాక నేరగాళ్లు కాల్ హ్యాంగ్‌ చేస్తున్నారని, అమాయక యూజర్లు కాల్ బ్యాక్ చేస్తే కేవలం 3 సెకన్లలోనే ఫోన్‌లోని కాంటాక్ట్ లిస్ట్, బ్యాంక్, క్రెడిట్‌ కార్డుతో పాటు ఇతర వివరాలను కేవలం 3 సెకన్లలో కాపీ చేసుకునే ప్రమాదం పొంచి ఉందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక అపరిచిత వ్యక్తులు కాల్ మాట్లాడుతూ హ్యాష్ 90 లేదా హ్యాష్ 09 నంబర్లను ప్రెస్ చేయాలని కోరితే నొక్కవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. పొరపాటున ఈ కోడ్‌లను ఎంటర్ చేస్తే యూజర్ సిమ్‌ కార్డు యాక్సెస్‌ కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని అప్రమత్తం చేశారు. ఈ విధంగా చేస్తే సదరు సిమ్ వినియోగదారుడిని నేరస్థుడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించే అవకాశం ఉంటుందని, అంతేకాకుండా బాధిత యూజర్ల ఛార్జీలతో నేరగాళ్లు ఫోన్‌కాల్స్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం! ఇక ఆ సమస్య లేనట్టే!

 

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం! ఇక ఆ సమస్య లేనట్టే!

 

మందుబాబులకు బిగ్ షాక్.. రాష్ట్రంలో వైన్స్ బంద్! ఎప్పటి నుంచంటే..? ఎందుకంటే?

 

ఆ జిల్లాలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్! ఇలా అప్లై చేసుకుంటే - నేరుగా అకౌంట్లోకి రూ. 2.50 లక్షలు జమ!

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... ఐటీ గ్లోబల్ పాలసీకు ఆమోదం! ఆంధ్రా పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప అవకాశం!

 

అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!

 

చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!

 

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..? చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా!

 

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #UnknownCall #Number