చ‌రిత్ర సృష్టించ‌నున్న నాసా స్పేస్‌క్రాఫ్ట్! సూర్యుడికి అతి స‌మీపంగా పార్క‌ర్ ప్రోబ్‌!

Header Banner

చ‌రిత్ర సృష్టించ‌నున్న నాసా స్పేస్‌క్రాఫ్ట్! సూర్యుడికి అతి స‌మీపంగా పార్క‌ర్ ప్రోబ్‌!

  Tue Dec 24, 2024 14:59        Technology

నాసా ప్ర‌యోగించిన పార్క‌ర్ సోలార్ ప్రోబ్(Parkar Solar Probe) స్పేస్‌క్రాఫ్ట్ ఇప్పుడు చ‌రిత్ర సృష్టించ‌నున్న‌ది. ఆ స్పేస్‌క్రాఫ్ట్ సూర్యుడికి అత్యంత స‌మీపంగా వెళ్ల‌నున్న‌ది. అతిభ‌యంక‌ర‌మైన వాతావ‌ర‌ణం, రేడియేష‌న్‌ను త‌ట్టుకుని ఆ వ్యోమ‌నౌక .. సూర్య‌డి స‌మీపానికి వెళ్తున్న‌ది. డిసెంబ‌ర్ 24వ తేదీన సూర్యుడి బ‌హ్య‌వ‌ల‌య‌మైన క‌రోనాకు స‌మీపంగా పార్క‌ర్ ప్రోబ్ వెళ్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. అయితే భ‌గ‌భ‌గ మండే భానుడికి స‌మీపంగా ఉన్న కార‌ణంగా.. ఆ స్పేస్‌క్రాఫ్ట్ నుంచి కొన్ని రోజుల పాటు సిగ్న‌ల్స్ అంద‌వని తెలిసింది. ఒక‌వేళ సూర్య‌డి అగ్నితాపాన్ని త‌ట్టుకుంటే, ఆ స్పేస్‌క్రాఫ్ట్ డిసెంబ‌ర్ 27వ తేదీన మ‌ళ్లీ సిగ్న‌ల్స్ పంపిస్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. క‌రోనా లేయ‌ర్‌కు స‌మీపానికి వెళ్ల‌డం వ‌ల్ల సూర్యుడు ఎలా ప‌నిచేస్తాడ‌న్న అధ్య‌యనాన్ని మ‌రింత లోతుగా విశ్లేషించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు శాస్త్ర‌వేత్తలు చెబుతున్నారు. శ‌తాబ్ధాలుగా సూర్యుడి గురించి ప్ర‌జ‌లు స్ట‌డీ చేశార‌ని, కానీ అతి స‌మీపం నుంచి ఆ వాతావర‌ణాన్ని ఎవ‌రూ అనుభ‌వించ‌లేద‌ని నాసా శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ నికోలా ఫాక్స్ తెలిపారు.

 

ఇంకా చదవండినిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం రూ.50 వేలు!Don'tMiss 

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

6 ల‌క్ష‌ల 92 వేల కిలోమీట‌ర్ల వేగంతో పార్క‌ర్ ప్రోబ్ ప్ర‌యాణిస్తోంది. సూర్యుడి క‌రోనాకు స‌మీపంగా వెళ్తున్న స‌మ‌యంలో.. పార్క‌ర్ ప్రోబ్ మెషిన్ సుమారు 982 డిగ్రీల సెల్సియ‌స్ వేడిని త‌ట్టుకోవాల్సి ఉంటుంది. 2018లో పార్క‌ర్‌ను తొలిసారి ప్ర‌యోగించారు. ఇప్ప‌టికే ఆ స్పేస్‌క్రాఫ్ట్ 21 సార్లు సూర్యుడిని చుట్టేసింది. సుమారు 4.5 ఇంచుల కార్బ‌న్ కంపోజిట్ షీల్డ్ ఉన్న పార్క‌ర్ స్పేస్‌క్రాఫ్ట్‌.. చాలా వేగంగా క‌రోనాను తాకి మ‌ళ్లీ బ‌య‌టి వాతావ‌ర‌ణంలోకి రానున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. కరోనా చాలా వేడిగా ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. కానీ ఎందుకు అక్క‌డ వాతావ‌ర‌ణం అలా ఉందో తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని ఖ‌గోళ‌శాస్త్ర‌వేత్త‌ డాక్ట‌ర్ జెన్నిఫ‌ర్ మిల్లార్డ్ తెలిపారు. సూర్యుడి కేంద్రానికి 6.1 మిలియ‌న్ల కిలోమీట‌ర్ల దూరం నుంచి పార్క‌ర్ ప్ర‌యాణించ‌నున్న‌ది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

 

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!

 

డబ్బులు కడితే దొంగ దొర అవుతాడా? పదేపదే నీతులు వల్లించే వైసీపీ నేత! మాజీ మంత్రి పై మంత్రి ఫైర్!

 

2025 జనవరితో ఆ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు బంద్! బ్యాకప్ లేకుంటే మీ డాటా పోయినట్టే!

 

USAలో మ‌రో తెలుగు విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి! ఎవరు? ఎందుకు? దీని వెనుక ఎవరి హస్తం!

 

నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Technology #Space #NASA #USA