అధిక సిమ్ కార్డులపై కఠిన చర్యలు! టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023లో కొత్త నిబంధనలు!

Header Banner

అధిక సిమ్ కార్డులపై కఠిన చర్యలు! టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023లో కొత్త నిబంధనలు!

  Fri Jun 28, 2024 22:28        Gadgets

నూతన టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 అమల్లోకి వచ్చింది

టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 దేశంలో జూన్ 26 నుంచి అమల్లోకి వచ్చింది. 1885 నాటి ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1933 నాటి ఇండియన్ వైర్‌లెస్ టెలిగ్రాఫ్ చట్టం స్థానంలో ఈ కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. చట్టంలోని సెక్షన్లు 1, 2, 10 నుంచి 30, 42 నుంచి 44, 46, 47, 50 నుంచి 58, 61, 62 వరకు నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త చట్టం టెలికాం రంగంలో గణనీయమైన మార్పులు తీసుకొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

 

ఇంకా చదవండి: జియో AirFiber సేవలు విస్తరణ! రూ. 101 నుంచి రూ. 401 వరకు! ఫైబర్ సేవలతోపాటు అదనపు డేటా సాచెట్ ప్యాక్స్ లాంచ్!

 

ఈ కొత్త టెలికమ్యూనికేషన్స్ చట్టం ప్రభుత్వానికి కీలక అధికారాలను కట్టబెట్టింది. భద్రత, నేరాల నియంత్రణ, పబ్లిక్ ఆర్డర్ సహా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో టెలికాం నెట్‌వర్క్ లేదా సేవలను తన నియంత్రణలోకి తీసుకొనేందుకు అవకాశం ఉంటుంది. వినియోగదారుల ఫిర్యాదుల కోసం ప్రత్యేకమైన వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తుంది.

ఈ కొత్త టెలికాం చట్టంలో సిమ్ కార్డుల జారీపై కఠిన నిబంధనలున్నాయి. ఒక గుర్తింపు కార్డుపై 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే రూ.50,000 జరిమానా విధించనున్నారు. రెండోసారి కూడా అదే స్థాయిలో ఉంటే రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. బయోమెట్రిక్ ద్వారానే కొత్త సిమ్ కార్డులు జారీచేస్తారు. నకిలీ సిమ్ కార్డులు కొనుగోలు చేసినా, విక్రయించినా, వినియోగించినా మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా రూ.50 లక్షల జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిమ్ కార్డు ద్వారా మోసాలకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష మరియు జరిమానా విధించనున్నారు.

 

ఇంకా చదవండి: ఇంత తక్కువ ధరకే మొబైల్ ఫోన్ వస్తుంది అంటే నమ్ముతారా! Realme C61 అదిరే ఫీచర్స్‌తో భారత మార్కెట్లోకి రాబోతోంది!

 

ప్రభుత్వ అనుమతి తప్పనిసరి: ఏదైనా టెలికాం సంస్థ నెట్‌వర్క్ ను ఏర్పాటు చేయాలన్నా లేదా సర్వీసులు అందించాలన్నా లేదా రేడియా పరికరాలు ఉపయోగించాలన్నా.. ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందులో జాతీయ భద్రతతోపాటు భారతీయ సాంకేతికతను ప్రోత్సహిస్తుంది. 

సేవల విస్తరణ: ఈ కొత్త టెలికాం చట్టం 2023 ప్రకారం యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ గ్రామీణ, మారుమూల మరియు పట్టణ ప్రాంతాల్లో సేవలకు విస్తరిస్తుంది. టెలికాం సేవలు, సాంకేతికత పరిశోధన, అభివృద్ధికి నిధులు సమకూరుస్తుంది. రిమోట్ ఏరియాల్లో అవసరమైన టెలికాం సర్వీసులకు యాక్సెస్ ఉండేలా చూస్తుంది. ఈ కొత్త టెలికాం కమ్యూనికేషన్స్ చట్టం 2023 ప్రకారం యూజర్లకు మెరుగైన భద్రత, నాణ్యమైన సేవలను అందిస్తుంది. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు అవాంచిత వాణిజ్య కమ్యూనికేషన్ నుంచి రక్షణ పొందుతుంది. గ్రామీణ ప్రాంతాలు, పూర్తి రిమోట్ ఏరియాలకు సరైన సర్వీసులు అందేలా చూస్తుంది.

 

ఇంకా చదవండి: గంజాయి అరికట్టడంలో కట్టుదిట్టమైన చర్యలు! ఎమ్మెల్యే గద్దె రామమోహన్!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

 

జూన్ 30 అర్థరాత్రి నుండి IPC చట్టాలకు విరామం! జులై 1 నుండి కొత్త క్రిమినల్ చట్టాలు అమలు!

 

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా! శామ్ పిట్రోడా తిరిగి నియామకం!

 

శాంసంగ్ నుంచి తొలిసారిగా మ్యూజిక్ ఫ్రేమ్ లాంచ్!  సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది! ఎక్కడ కొనుగోలు చేయాలి?

 

ఆస్కార్ సభ్యత్వ ఆహ్వానానికి రాజమౌళి దంపతులు! ఆహ్వానం అందుకున్న భార‌తీయ‌ సెల‌బ్రిటీల్లో!

 

అసెంబ్లీకి వచ్చి చేసిన తప్పులను జగన్ ఒప్పుకోవాలి! ఆచంట సునీత సంచలన వ్యాఖ్యలు!

 

ఏపీ కేబినెట్ తొలి సమావేశం! రాజధాని, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ!

 

2024లో ఆపిల్ నుండి iPhone 16 సిరీస్! ధర, విడుదల తేదీ వివరాలు!

 

మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?

 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #TelecommunicationsAct2023 #NewRegulations #SIMCardRules #TelecomLaw #ConsumerProtection #TelecomSafety #IndiaTelecom #TechLaw #DigitalIndia #TelecomReforms