SIM స్వాపింగ్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు! TRAI సరికొత్త నిబంధనలు! జులై 1 నుంచి అమల్లోకి!

Header Banner

SIM స్వాపింగ్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు! TRAI సరికొత్త నిబంధనలు! జులై 1 నుంచి అమల్లోకి!

  Sat Jun 29, 2024 21:16        Gadgets

సిమ్ కార్డు స్వాపింగ్ స్కామ్‌లు ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఈ సమస్యను తగ్గించడానికి కొన్ని కీలక నిబంధనలు రూపొందించింది. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంపీఎన్) కోసం కొత్త నిబంధనలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనలు సిమ్ స్వాప్ లేదా రీప్లేస్‌మెంట్ ద్వారా జరిగే మోసాలను నిరోధించడానికి ఉపయోగపడతాయి.

 

ఇంకా చదవండి: అధిక సిమ్ కార్డులపై కఠిన చర్యలు! టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023లో కొత్త నిబంధనలు!

 

ట్రాయ్ ప్రకారం, సిమ్ మార్పిడి తర్వాత మొబైల్ నంబర్ పోర్టింగ్ సమయాన్ని 10 రోజుల నుంచి 7 రోజులకు తగ్గించింది. ఈ నిర్ణయం సిమ్ స్వాప్ లేదా రీప్లేస్‌మెంట్ తేదీ నుంచి ఏడు రోజులు గడువు ముగిసేలోపు UPC కోసం వచ్చిన అభ్యర్థనను నిలిపివేయడంలో సహాయపడుతుంది. 10 రోజుల గడువు 7 రోజులకు తగ్గించడం వల్ల అత్యవసరంగా పోర్ట్ చేయాల్సిన వినియోగదారులకు ఈ మార్పు ఉపయోగపడుతుంది.

సిమ్ స్వాప్ అంటే నేరగాళ్లు మీ నంబర్‌పై కొత్త సిమ్ కార్డును పొందడం. ఈ సిమ్ కార్డులను ఉపయోగించి మీ బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలు జరపడం సాధ్యం అవుతుంది. ఈ తరహా నేరాలను నిరోధించడానికి ట్రాయ్ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.

 

ఇంకా చదవండి: వాట్సాప్ లేటెస్ట్ అప్డేట్! గ్రూప్ చాట్స్‌లో కొత్త ఈవెంట్ ఫీచర్! ఎలా పని చేస్తుందో చూడండి!

 

జూన్ 26 నుంచి భారత్‌లో టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 అమల్లోకి వచ్చింది. ఇందులో సిమ్ కార్డుల వినియోగంపై నియంత్రణ విధించారు. ఒక గుర్తింపు కార్డుతో గరిష్ఠంగా 9 సిమ్ కార్డులు మాత్రమే వినియోగించేందుకు అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉంటే జరిమానా మరియు జైలు శిక్ష విధించనున్నారు.

కొత్త టెలికాం చట్టంలో సిమ్ కార్డుల జారీపై కఠిన నిబంధనలు ఉన్నాయి. ఒక గుర్తింపు కార్డుపై 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే రూ.50,000 జరిమానా విధించనున్నారు. రెండోసారి కూడా అదే స్థాయిలో ఉంటే రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. బయోమెట్రిక్ ద్వారానే కొత్త సిమ్ కార్డులు జారీ చేయబడతాయి. నకిలీ సిమ్ కార్డులను కొనుగోలు, విక్రయించడం లేదా వినియోగించడం వల్ల మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా రూ.50 లక్షల జరిమానా విధించనున్నారు. సిమ్ కార్డు ద్వారా మోసాలకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష మరియు జరిమానా విధించనున్నారు.

 

ఇంకా చదవండి: రాజధాని కోసం మరోసారి భూములు ఇచ్చేందుకు సిద్ధం! అమరావతి రైతుల పెద్ద మనసు!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు ఇవే!

 

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

 

జూన్ 30 అర్థరాత్రి నుండి IPC చట్టాలకు విరామం! జులై 1 నుండి కొత్త క్రిమినల్ చట్టాలు అమలు!

 

శాంసంగ్ నుంచి తొలిసారిగా మ్యూజిక్ ఫ్రేమ్ లాంచ్!  సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది! ఎక్కడ కొనుగోలు చేయాలి?

 

మరోచరిత్ర సృష్టించనున్న చంద్రబాబు! స్వయంగా ఇళ్లకు వెళ్ళి పెన్షన్ పంపిణీ! ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం!

 

అమరావతికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం! రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మికి కీలక బాధ్యతలు!

 

2024లో ఆపిల్ నుండి iPhone 16 సిరీస్! ధర, విడుదల తేదీ వివరాలు!

 

మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?

 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #TRAI #MobileNumberPortability #SIMSwapping #TelecomRegulations #FraudPrevention #TelecomNews #IndiaTelecom #NewRegulations #ConsumerProtection