స్మార్ట్‌ ఫోన్‌లకు మాల్వేర్‌ ముప్పు! భద్రతా సంస్థ హెచ్చరిక!

Header Banner

స్మార్ట్‌ ఫోన్‌లకు మాల్వేర్‌ ముప్పు! భద్రతా సంస్థ హెచ్చరిక!

  Tue Jul 02, 2024 22:08        Gadgets

స్మార్ట్‌ఫోన్‌లకు మాల్వేర్‌ ముప్పు కొనసాగుతూనే ఉంది. ఎంత నిఘా వేసినా, ఎప్పటికప్పుడు నూతన మాల్వేర్‌లు ఉద్భవిస్తూ, భద్రతా సమస్యలను పెంచుతున్నాయి. ప్రస్తుత మాల్వేర్‌లు చాలా శక్తివంతంగా ఉండి, ఫోన్‌ భద్రతా వ్యవస్థలను దాటుకుంటూ సున్నితమైన సమాచారాన్ని దొంగిలించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇటీవలి కాలంలో ప్రోమోన్‌ (Promon) అనే భద్రతా సంస్థ ఒక ప్రమాదకరమైన మాల్వేర్‌ గురించి హెచ్చరించింది.

 

ఇంకా చదవండి: వాట్సాప్‌ కీలక ప్రకటన! 66 లక్షల ఖాతాలు బ్లాక్‌! కొత్త సైబర్ భద్రతా చర్యలు!

 

స్నోబ్లైండ్‌ (Snowblind) అనే ఈ మాల్వేర్‌ ఫోన్‌ భద్రతా వ్యవస్థలను దాటి, సున్నితమైన డేటాను దొంగిలిస్తుంది. ముఖ్యంగా, వ్యక్తిగత సమాచారాన్ని కలిగి ఉన్న యాప్‌లను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ మాల్వేర్‌ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ వ్యవస్థ తనిఖీ చేయక ముందే యాప్‌లను ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం వల్ల ఫోన్‌ యాప్‌లు దొంగిలించి, డేటాను నియంత్రిస్తుంది. ఇది ఫోన్‌లోకి చొరబడినా, గుర్తించడం చాలా కష్టం.

వినియోగదారులు ఈ తరహా మాల్వేర్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తెలియని వెబ్‌సైట్‌లు, అప్రమాణికమైన యాప్‌లు డౌన్‌లోడ్‌ చేయకుండా, లింక్‌లను క్లిక్‌ చేయకుండా ఉండాలి. ఫోన్‌ తయారీ సంస్థల సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

 

ఇంకా చదవండి: న్యూయార్క్‌ బ్రూక్లిన్‌ ప్రైడ్‌ ఈవెంట్‌లో! మహిళపై మిలియనీర్‌ బ్యాంకర్‌ దాడి! పదవికి రాజీనామా!

 

మాల్వేర్‌ ముప్పు లక్షణాలు:

ఫోన్‌ వేడెక్కడం: ఫోన్‌ను ఎక్కువ సేపు వినియోగించని సమయంలో కూడా వేడెక్కితే, హ్యాకింగ్‌ గురై ఉంటుందని అనుమానించవచ్చు.

బ్యాటరీ డిశ్చార్జ్: అకస్మాత్తుగా బ్యాటరీ డిశ్చార్జ్ అవడం.

ఫోన్‌ నెమ్మదిగా స్పందించడం: బ్యాక్‌గ్రౌండ్‌లో ఎటువంటి యాప్‌లు లేకపోయినా, ఫోన్‌ నెమ్మదిగా స్పందిస్తే.

అనుమానాస్పద లింకులు: అనుమానాస్పద లింక్‌పై క్లిక్‌ చేసిన తర్వాత సమస్యలు వస్తే.

యాప్‌లు ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అవ్వడం: మీ అనుమతి లేకుండా యాప్‌లు ఇన్‌స్టాల్‌ కావడం.

 

ఇంకా చదవండి: USA అధ్యక్ష ఎన్నికలపై ఆసక్తికరమైన పరిణామాలు! భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి కీలక బాధ్యత!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

క్వాంటాస్ ఫ్లైట్‌లో విషాదం! భారత సంతతికి చెందిన యువతి మృతి!

 

రేపు రాత్రి ఢిల్లీ చేరుకొనున్న సీఎం చంద్రబాబు! ఎందుకంటే!

 

ఈ నెలలోనే నీట్ పీజీ పరీక్ష! రెండు గంటల ముందు పేపర్ తయారీ!

 

విశాఖ సెంట్రల్ జైలులో హోంమంత్రి వంగలపూడి అనిత తనిఖీలు! గంజాయి కేసులో ఏకంగా 1200 మంది అరెస్ట్!

 

MLA కోటా MLC కూటమి అభ్యర్థులు ఖరారు! రేపే నామినేషన్లు! అభ్యర్థులు ఎవరంటే!

 

నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!

 

అధిక సిమ్ కార్డులపై కఠిన చర్యలు! టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023లో కొత్త నిబంధనలు!

 

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

 

దక్షిణ ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరం లో అంగరంగ వైభవంగా! కూటమి విజయోత్సవ వేడుకలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #SmartphoneSecurity #MalwareAlert #CyberSecurity #AndroidSafety #DataPrivacy #SnowblindMalware #PromonSecurity #DigitalSafety #TechNews #MobileSecurity