నటుడు పృథ్వీరాజ్‌కు కోర్టు బిగ్ షాక్! భార్య శ్రీలక్షి మనోవర్తి కేసులో విజయవాడ ఫ్యామిలీ!

Header Banner

నటుడు పృథ్వీరాజ్‌కు కోర్టు బిగ్ షాక్! భార్య శ్రీలక్షి మనోవర్తి కేసులో విజయవాడ ఫ్యామిలీ!

  Thu Jun 13, 2024 10:17        Entertainment

‘30 ఇయర్స్‌ ఇండస్ట్రీ’ పేరిట మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీనటుడు పృథ్వీరాజ్‌కు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ స్థానిక ఫ్యామిలీ కోర్టు అతడికి బుధవారం నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. మనోవర్తి చెల్లించాలంటూ పృథ్వీ భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మి అతడిపై ఫ్యామిలీ కోర్టులో వేసిన కేసులో ఈ పరిణామం చోటుచేసుకుంది. భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మికి నెలకు రూ.8 లక్షలు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలను పాటించని పృథ్వీ హైకోర్టులో సవాలు చేశారు. కేసును పరిశీలించిన న్యాయస్థానం తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ భార్యకు నెలకు రూ.22వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. అప్పటి వరకు ఉన్న బకాయిలు మొత్తం చెల్లించాలని స్పష్టం చేసింది.

 

ఇంకా చదవండి:  బాయ్‌ఫ్రెండ్‌తో సోనాక్షి సిన్హా వివాహం ఫిక్స్! డేట్ ఎప్పుడంటే! సల్మాన్ సినిమాలతో ఇద్దరూ బాలీవుడ్ ఎంట్రీ!

 

అయితే పృథ్వీరాజ్ హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయలేదు. దీంతో భార్య శ్రీలక్ష్మి తన న్యాయవాదులు సుంకర రాజేంద్రప్రసాద్‌, సప్పా రమేష్‌, సీహెచ్‌ వడ్డీకాసులును సంప్రదించి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ వేశారు. పృథ్వీరాజ్ కోర్టుకు హాజరుకాకుండా కేసు వివరాలను ఒక దినపత్రికలో ప్రకటన చేశారని, కోర్టుకు హాజరుకావడం లేదని లాయర్లు పిటిషన్‌లో వివరించారు. ఫ్యామిలీ కోర్టు జడ్జి బుధవారం పిటిషన్‌ను పరిశీలించారు. పృథ్విరాజ్‌కు నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్ వారెంటు జారీ చేశారు. దీంతో పృథ్వీరాజ్ చిక్కుల్లో పడ్డట్టు అయింది.


ఇంకా చదవండి: ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే ఆ లిస్ట్!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న సైకిల్! ఆపడానికి ఎవరూ సాహసం చేయలేరు! వివిధ చానల్స్ లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణ మీకోసం!

 

విడుదల అయిన ఎక్సిట్ పోల్స్! ఎన్డీఏదే హవా!

 

ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!

 

రియల్​ మీ జీటీ 6టీ.. సోనీ కెమెరా, హైస్పీడ్​ చార్జింగ్, ఇతర ఫీచర్లు, అతి తక్కువ ధరకే! మరియు ఎక్స్ట్రా డిస్కౌంట్!

 

జగపతిబాబు: రియల్ ఎస్టేట్ రంగంలో నేను కూడా మోసపోయాను! తనను మోసగించిన వాళ్లెవరు? అసలేం జరిగింది?

 

వాట్సాప్ కొత్త అప్‌డేట్.. ఇప్పుడు మరింత ఫన్.. ‘ఏఐ ఇమాజిన్’ ఫీచర్‌తో యూజర్లు ఫొటోలు!

 

మారుమూల గ్రామంలో జన్మించిన భారతీయుడి ఆస్తి విలువ ₹65,150 కోట్లు! జీరో నుండి ఎదిగిన అతని పేరు ఆ దేశాలలో చెప్తే!

 

ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్! ఈ మూడు రోజులు షాపులు బంద్! పొరపాటున దొరికితే అంతే ఇంకా!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Tollywood #Actor #Prithviraj #Nonbailable #ArrestWarrant #Vijayawada Family CourtVijayawada #TollywoodMovieNews