మంత్రి సురేఖ వ్యాఖ్య‌ల‌పై.. నాగచైత‌న్య, నాని, అఖిల్‌, కుష్బూ ఏమ‌న్నారంటే!

Header Banner

మంత్రి సురేఖ వ్యాఖ్య‌ల‌పై.. నాగచైత‌న్య, నాని, అఖిల్‌, కుష్బూ ఏమ‌న్నారంటే!

  Thu Oct 03, 2024 09:06        Entertainment

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచ‌ల‌నంగా మారాయి. ఇటు రాజకీయవర్గాలతో పాటు, అటు సినీ పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారాయి.  ఇప్పటికే సురేఖ వ్యాఖ్యలను నాగార్జున, స‌మంత‌, ప్రకాశ్ రాజ్, అమ‌ల‌, ఎన్‌టీఆర్ తీవ్రంగా ఖండించారు. తాజాగా నాగ చైత‌న్య, హీరో నాని, అఖిల్‌, కుష్బూ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. 



మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌లు పూర్తిగా అబద్ధ‌మే కాకుండా హాస్యాస్ప‌దం: నాగ‌చైత‌న్య


స‌మంత‌తో త‌న విడాకుల‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌ను అక్కినేని నాగ చైత‌న్య తీవ్రంగా ఖండించారు. మంత్రి వ్యాఖ్య‌లు పూర్తిగా అబద్ధ‌మే కాకుండా హాస్యాస్ప‌దమ‌ని పేర్కొన్నారు. "జీవితంలో విడాకుల నిర్ణ‌యం అనేది అత్యంత దుర‌దృష్ట‌క‌ర‌మైన‌, బాధాక‌ర‌మైన విష‌యాల్లో ఒక‌టి. ఎన్నో ఆలోచ‌న‌ల త‌ర్వాత ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే నా మాజీ భార్య‌, నేను విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఆ త‌ర్వాత విడాకులు తీసుకున్నాం. మా విడాకుల‌పై గ‌తంలో అనే నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇరు కుటుంబాల‌పై ఉన్న గౌర‌వంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా. తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌లు పూర్తిగా అబద్ధ‌మే కాకుండా హాస్యాస్ప‌దం. ఆమె వ్యాఖ్య‌లు ఆమోద‌నీయం కాదు. స‌మాజంలో మ‌హిళ‌ల‌కు మ‌ద్ద‌తుతో పాటు గౌర‌వం ద‌క్కాలి. సినీ ప్ర‌ముఖుల ప‌ర్స‌న‌ల్ లైఫ్ నిర్ణ‌యాల‌ను మీడియా హెడ్ లైన్స్ కోసం ఉప‌యోగించుకోవడం సిగ్గుచేటు" అని నాగ‌చైత‌న్య ట్వీట్ చేశారు.  

ఇంకా చదవండి: కొండా సురేఖను రెచ్చగొట్టి మీరే తన్నించుకున్నారు! కేటీఆర్‌పై జగ్గారెడ్డి ఆగ్రహం! రాహుల్ గాంధీపై కూడా!


సమాజానికి చెడుగా ప్రతిబింబించే ఇలాంటి వాటిని అంద‌రూ ఖండించాలి: నాని   


"
తాము ఏం మాట్లాడినా త‌ప్పించుకోవ‌చ్చ‌ని రాజకీయ నాయకులు అనుకోవడం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మీ మాటలే ఇలా బాధ్యతారహితంగా ఉన్నప్పుడు, ప్రజల పట్ల మీకు బాధ్యత ఉంటుందని ఆశించడం మూర్ఖ‌త్వ‌మే అవుతుంది. ఇది కేవలం నటులు లేదా సినిమా గురించి కాదు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు. ఇంత గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరైంది కాదు. సమాజానికి చెడుగా ప్రతిబింబించే ఇలాంటి వాటిని అంద‌రూ ఖండించాలి" అని నాని ట్వీట్ చేశారు. 



ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్య‌ల‌పై స్పందించ‌డం త‌ప్ప వేరే మార్గం లేదు: అక్కినేని అఖిల్  


మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై అక్కినేని అమ‌ల చేసిన ట్వీట్‌కు ఆమె కుమారుడు, యువ న‌టుడు అఖిల్ స్పందించారు. "అమ్మ‌.. మీ ప్ర‌తి మాట‌కు నేను మ‌ద్ద‌తు ఇస్తున్నాను. ఇలాంటి అర్థం లేని విష‌యంపై మీరు స్పందించాల్సి రావ‌డం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేస్తున్నాను. కానీ కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్య‌ల‌పై స్పందించ‌డం త‌ప్ప మ‌న‌కు వేరే మార్గం లేదు" అని అఖిల్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.



మంత్రి కొండా సురేఖ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి: న‌టి కుష్బూ


మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌, న‌టి కుష్బూ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా సినీ పరిశ్రమ గురించి బాధ్య‌త‌రాహిత్య‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు. సినీ పరిశ్రమ ఇకపై ఇలాంటి వాటిని స‌హించ‌బోద‌ని, మొత్తం సినీ పరిశ్రమకు సురేఖ‌ క్షమాపణ చెప్పాల‌ని కుష్బూ ట్వీట్ చేశారు. "రెండు నిమిషాల ఫేమ్, ఎల్లో జర్నలిజంలో మునిగిపోయే వారు మాత్రమే ఇలాంటి భాష మాట్లాడతార‌ని అనుకున్నాను. కానీ ఇక్కడ స్త్రీత్వానికి ఘోర అవమానాన్ని చూస్తున్నాను. కొండా సురేఖ గారూ, మీలోని విలువలు ఏమైపోయాయి? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు సినీ పరిశ్రమపై ఇలాంటి నిరాధారమైన, భయంకరమైన, కించపరిచే ప్రకటనలు చేయ‌రాదు. ఇలాంటి ఆధారంలేని ఆరోప‌ణ‌లు చేస్తే సినీ పరిశ్రమ చూస్తూ కూర్చోదు. ఇలాంటి నిరాధారమైన, తప్పుడు ఆరోపణలకు మీరు మరొక మహిళకు మహిళగా, మొత్తం సినీ పరిశ్రమకు క్షమాపణ చెప్పాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది వన్ వే ట్రాఫిక్ కాదు, కానీ మేము మీ స్థాయికి దిగజారలేం" అని కుష్బూ చెప్పుకొచ్చారు.

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

 

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరు? ఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!

 

ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!

 

రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలో!

 

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!

 

ఆంధ్రాలో అమెరికా వీసా అప్లికేషన్ కౌన్సిలేట్ సెంటర్! స్టూడెంట్స్, వ్యాపారస్తులకు తొలగనున్న ఇబ్బందులు! ఎప్పుడు మొదలవుతుంది అంటే!

 

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ!

 

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త! రికార్డు స్థాయిలో వీసా అపాయింట్మెంట్లు జారీకి ఆమోదం! స్టూడెంట్స్, వ్యాపారస్తులు, తల్లిదండ్రులు ఫుల్ ఖుషి!

 

దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం! అసలు జరిగింది అంటే!

 

మందు బాబులకు షాక్.. రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్! ఈ ఏడాది ఓనం మద్యం విక్రయాలు!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. ఇలా చేస్తే, 3 ఉచిత సిలిండర్లు రావు! ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు!

 

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Nani #AkkineniAkhil #KhushbuSundar #KondaSurekha